Kaizer News

PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం

· National - India · ntvtelugu.com

PM Modi: పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థికంగా ఎలా ఎదగాలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. "ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్" అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మన దేశంలో పునరుత్పాదక ఇంధనం, పరిశుభ్రమైన రవాణా వ్యవస్థలు, నీటి సంరక్షణ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో వివరిస్తూ, పర్యావరణ పరిరక్షణతో పాటే ఆర్థిక పురోగతి కూడా సాధ్యమేనని స్పష్టం చేశారు. ప్రకృతితో మమేకమై జీవించడం భారత్‌కు శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారం అని మోడీ గుర్తుచేశారు. తరతరాలుగా పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన భారత్, ఆ సాంప్రదాయ అనుభవాలు, సిద్ధాంతాల పునాదిగానే నేటి ఆధునిక వాతావరణ సమస్యలకు పరిష్కారాలు చూపుతోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణకు కలిసికట్టుగా ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో తలసరి కార్బన్ ఉద్గారాల పరిమాణం చాలా తక్కువగా ఉందన్నారు. మన ప్రాచీన పర్యావరణ ఆలోచనలనే నేటి ఆధునిక పరిష్కారాలుగా మారుస్తూ ప్రకృతిని కాపాడుకుంటున్నామని తెలిపారు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News