Kaizer News

నేపాల్‎లో 675కు పెరిగిన మృతుల సంఖ్య.. ఇప్పటికీ లభి

నేపాల్‎లో 675కు పెరిగిన మృతుల సంఖ్య.. ఇప్పటికీ లభించని 2,400 మంది ఆచూకీ

· State - Telangana · v6velugu.com

ఖాట్మండు: ప్రకృతి విలయంతో నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లింది. దేశ పునర్నిర్మాణ పనుల కోసం సుమారు 4 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33,000 కోట్ల నుంచి రూ.42,000 కోట్లకు పైగా) అవసరమవుతాయని ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. ఇది దేశ జీడీపీలో దాదాపు పదో వంతుకు సమానమని ఆయన పేర్కొన్నారు. నష్ట తీవ్రతపై తుది అంచనా వేస్తున్నామని, అయితే 2015 నాటి భూకంపంతో పోలిస్తే ఈసారి పునర్నిర్మాణ వ్యయం కొంత తక్కువగానే ఉండవచ్చని ఆయన చెప్పారు. కాగా, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకస్మిక వరదల్లో చిక్కుకొని మృతిచెందిన వారి సంఖ్య 675కు చేరింది. బురదలో కూరుకుపోయిన డెడ్​బాడీలను భద్రతా బలగాలు వెలికితీశాయి. సుమారు 2,400 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి ఇప్పటివరకూ 4,450 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. వీరిలో 187 మంది విదేశీయులు ఉన్నారు. ప్రధానంగా రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడ యుద్ధప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విపత్తు తీవ్రత భారీగా ఉండటంతో నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం సాయం కోరింది. టన్నెల్స్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత్‌‌‌‌‌‌‌‌కు చెందిన 11 మంది నిపుణుల సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. భారత్ ఇప్పటికే 57 టన్నుల నిత్యావసర, సహాయక సామగ్రిని తరలించింది. చైనా నుంచి ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం రానుండగా.. జపాన్, ఆస్ట్రేలియాల నుంచి కూడా సహాయక సామగ్రి చేరుకుంటోంది. కాగా, బాధితుల్లో విదేశీ పర్యాటకులు భారీగా ఉండటంతో నేపాల్ విదేశాంగ శాఖ ప్రత్యేక ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. మృతుల గుర్తింపు, బాధిత కుటుంబాలతో సమన్వయం, స్వదేశాలకు పంపే ప్రక్రియలను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది. వరదల ధాటికి మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధాన వంతెనలు, రోడ్లు ధ్వంసమవడంతో పాటు జలవిద్యుత్ కేంద్రాలు నీటమునిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం నష్టతీవ్రతను అంచనా వేసే పనిలో పడింది. అంతర్జాతీయ సాయాన్ని ప్రభుత్వం నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను నేపాల్ కొట్టిపారేసింది. పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాల మద్దతు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు లెక్కలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నేరుగా ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలు జమ చేయాలని కోరింది. సరిహద్దుల్లో చిక్కుకున్న భారతీయులు నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించిన వివరాల ప్రకారం..కనీసం 320 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చైనా వైపు దాదాపు 400 మంది చిక్కుకుపోగా, వారిలో 153 మంది సురక్షితంగా సరిహద్దు దాటి నేపాల్ చేరుకున్నారు. నేపాల్ చేరుకున్న 149 మంది భారతీయుల వివరాలతో కూడిన జాబితాను విదేశాంగ శాఖ విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఖాట్మండు చేర

Original source: v6velugu.com
Read more on Kaizer News