Kaizer News

నేను వికెట్‌ టేకర్‌నని కెప్టెన్‌కు తెలియదు

నేను వికెట్‌ టేకర్‌నని కెప్టెన్‌కు తెలియదు

· Sports · ntnews.com

న్యూఢిల్లీ: బ్యాట్‌తో మైదానంలో పరుగుల వర్షం కురిపించే 15 ఏండ్ల బీహార్‌ బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఈసారి బంతి పట్టి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరాడు. దులీప్‌ ట్రోఫీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన వైభవ్‌.. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై అనూహ్యంగా బౌలింగ్‌కు దిగిన 3 ఓవర్లలోనే 2 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నాళ్లు సిక్సర్ల పిడుగుగా పేరు తెచ్చుకున్న వైభవ్‌ తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. ఆపోరులో తనకు బౌలింగ్‌కు ఇచ్చే ముందు ఈస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌తో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించాడు. ‘ఎంతటి బ్యాటర్‌కైనా బౌలింగ్‌ చేయడం ఇష్టమే. ప్రత్యర్థి జట్టు వికెట్లు పడకపోయేసరికి నన్ను 2, 3 ఓవర్లు వేయమని ఇషాన్‌ భయ్యా అడిగాడు. నాతో బౌలింగ్‌ చేయించి తను పెద్ద రిస్క్‌ తీసుకుంటున్నానని భావించాడు. కానీ, నేను వికెట్‌ టేకర్‌నని ఇషాన్‌ భయ్యాకు తెలియదు’ అని వైభవ్‌ చమత్కరించాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటర్‌గా 8 పరుగులకే నిరాశపరిచినప్పటికీ, బౌలింగ్‌తో ఆ లోటు తీరిందని, ఓ వికెట్‌ తీసినప్పుడు వచ్చే ఆనందమే వేరని వైభవ్‌ వ్యాఖ్యానించాడు

Original source: ntnews.com
Read more on Kaizer News