Kaizer News

చక్కెర మానేస్తే 30 రోజుల్లో మీ ఒంట్లో జరిగే అద్భుత

చక్కెర మానేస్తే 30 రోజుల్లో మీ ఒంట్లో జరిగే అద్భుత మార్పులు

· Health · tv9telugu.com

నేటి ఆధునిక జీవనశైలిలో చక్కెర అనేది మనకు తెలియకుండానే ఓ తీపి వ్యసనంలా మారిపోయింది. కాఫీ, టీలు మొదలుకొని స్వీట్లు, కేకుల వరకు దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలలో చక్కెరను అతిగా వాడుతున్నాం. నిజానికి, చక్కెర మన ఆరోగ్యానికి పెద్ద శత్రువు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక జబ్బుల్ని తెచ్చిపెట్టే చక్కెర వాడకాన్ని తగ్గించడం, వీలైతే పూర్తిగా మానుకోవటం మన ఆరోగ్యానికి అత్యంత అవసరం. నిజానికి, చక్కెరను మానేసిన నెల రోజుల్లోనే మన శరీరంలో ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులు కనిపిస్తాయి. తెల్లటి చక్కెర పైకి ఆహారాలకు రుచినిచ్చినా, లోలోపల మాత్రం నిశ్శబ్దంగా మన జీవక్రియలను నిర్వీర్యం చేస్తుంది. మన శరీరంలోకి అధికంగా చక్కెర చేరినప్పుడు కాలేయం దానిని కొవ్వుగా మార్చేస్తుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య మొదలైపోతుంది. అంతేకాదు, ప్యాంక్రియాస్ నిరంతరం ఇన్సులిన్ హార్మోన్‌ను విపరీతంగా ఉత్పత్తి చేయాల్సి రావడం వల్ల కణాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుకుంటాయి. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పోషకాహార నిపుణులు అయితే చక్కెరను కొత్త కొకైన్‌గా అభివర్ణిస్తున్నారు. కొకైన్ మాదిరిగానే, చక్కెర కూడా డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేసి తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది. చాక్లెట్లు, చక్కెర పానీయాలు, కోలా డ్రింక్స్, స్వీటెన్డ్ బెవరేజెస్, కేకులు, బేకరీ ఉత్పత్తులు వంటివి అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలు. వీటిని 30 రోజుల పాటు పూర్తిగా దూరం పెడితే శరీరం మరమ్మత్తు, పునరుజ్జీవన స్థితిలోకి వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్ర సమయంలో శరీరం లోపల పునరుజ్జీవనం జరుగుతుంది. ఒక 30 రోజుల పాటు తెల్లటి పంచదారను పూర్తిగా పక్కన పెడితే శరీరంలో అనేక అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిసరైడ్లు సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. చక్కెర మానేసిన తొలి రోజుల్లో మన శరీరం ఒక విధమైన విత్ డ్రాయల్ సింప్టమ్స్‌కు గురవుతుంది. చక్కెర వల్ల మెదడులో విడుదలయ్యే డోపమైన్ అనే ఆనంద హార్మోన్ ఆగిపోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నీరసం, చిరాకు, డిప్రెషన్ వంటివి వస్తాయి. ఇది పొగత్రాగడం లేదా మద్యపానం మానేసినప్పుడు కలిగే అనుభూతి లాంటిదే అయినా, ఇది తాత్కాలికం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. మొదటి వారం దాటిన తర్వాత, మన శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రెండో వారం నుంచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలు సమతుల్యత సాధించడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో శరీరం పేరుకుపోయిన కొవ్వును ఇంధనంగా వాడుకోవడం మొదలవుతుంది. విసరల్ ఫ్యాట్ లేదా పొట్ట చుట్టూ ఉన్న ప్రమాదకరమైన కొవ్వు కరగడం మొదలవుతుంది. 30 రోజుల వ్యవధిలో దాదాపు 2 నుంచి 4 కిలోల బరువు తగ్గుతారని, శరీరంలోని ఇన్ఫ్లమేషన్ (అంతర్గత వాపులు) మాయమైపోతాయని, చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్ల స్థాయిలు బాగా తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చక్కెర మానేశాం కాబట్టి పండ్లు, తేనె, బెల్లం కూడా తినకూడదనే అనుమానం చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం మానే

Original source: tv9telugu.com
Read more on Kaizer News