Shorts మార్కాపురం జిల్లా: కనిగిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ సత్తా ఏంటో చూపించాలని కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ స్థానిక పార్టీ కార్యాలయంలో హనుమంతునిపాడు మండల పార్టీ అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కనిగిరి నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పిలుపుమేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయవచ్చన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూటమి నేతలు దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులం, మతం,పార్టీలు, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుంతుందన్నారు. ఐదేళ్లలో రూ. 4.49 లక్షల కోట్లు డీబీటీ -నాన్ డీబీటీ ద్వారా పేదలకు లబ్ది చేకూరిందని గుర్తు చేశారు.ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500,నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వాళ్లకు 50 ఏళ్లకే పెన్షన్,డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు,విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ వంటి హామీలు అమలుచేయకుండా ఆయా వర్గాలను వంచించారన్నారు అలవిగాని హామీలు ఇవ్వడంతరువాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు కు కొత్తేమీ కాదన్నారు.రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు సర్కార్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొందన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ అందరమూ సమిష్టిగా గ్రామాల్లో పార్టీ బలోపేతానికి మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషిచేయాలన్నారు.2029 సార్వత్రిక ఎన్నికల్లో దద్దాల నారాయణ యాదవ్ గారి గెలుపుకోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని మళ్ళీ మరోసారి జగనన్న ను ముఖ్యమంత్రి చేసుకుందామన్నారు. ఈ సమావేశం లో వైఎస్సార్సీపీ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు