Kaizer News

India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బ

India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!

· National - India · ntvtelugu.com

3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..! టీమిండియాకు 2026లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వరుస మ్యాచ్‌లతో బిజీ షెడ్యూల్ సెప్టెంబర్ 22న జపాన్‌తో సానోలో టీ20 మ్యాచ్‌ సెప్టెంబర్ 28న ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్‌తో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్.. Follow Us : --> Add as a preferred source on google India Matches: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మంచి జోరుమీద ఉంది. అయితే ఈ ఏడాదిలో మరో 3 నెలలు మిగిలి ఉండగా.. ఈ సమయంలో కూడా క్రికెట్‌ సందడి కొనసాగనుంది. అఫ్గానిస్థాన్ సిరీస్ తర్వాత భారత్ ముందుగా జపాన్‌తో చారిత్రాత్మక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా ఆసియా క్రీడలు, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌లతో భారత జట్టు సుమారు 30 మ్యాచ్ లతో బిజీగా ఉండనుంది. భారత్, జపాన్ పురుషుల జట్లు తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో తలపడనున్నాయి. సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్, జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. జపాన్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు 2026 ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. పురుషుల క్రికెట్ టోర్నీలో భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. జపాన్‌లో జరిగే ఈ పోటీల్లో భారత్ సెప్టెంబర్ 28న తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా క్రీడల సమయంలోనే భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 27 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది. వన్డే సిరీస్ ముగిశాకా అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డేలు తిరువనంతపురం, గువాహటి, న్యూ చండీగఢ్‌లో, టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరగనున్నాయి. తొలి వన్డే: సెప్టెంబర్ 27, 2026 – తిరువనంతపురం రెండో వన్డే: సెప్టెంబర్ 30, 2026 – గువాహటి మూడో వన్డే: అక్టోబర్ 3, 2026 – న్యూ చండీగఢ్ తొలి టీ20: అక్టోబర్ 6, 2026 – లక్నో రెండో టీ20: అక్టోబర్ 9, 2026 – రాంచీ మూడో టీ20: అక్టోబర్ 11, 2026 – ఇండోర్ నాలుగో టీ20: అక్టోబర్ 14, 2026 – హైదరాబాద్ ఐదో టీ20: అక్టోబర్ 17, 2026 – బెంగళూరు వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే, భారత్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా అక్టోబర్, నవంబర్ నెలల్లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. ఇరు దేశాల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రచారానికి కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. తొలి టీ20: అక్టోబర్ 22 – క్రైస్ట్‌చర్చ్ రెండో టీ20: అక్టోబర్ 24 – క్రైస్ట్‌చర్చ్ మూడో టీ20: అక్టోబర్ 27 – వెల్లింగ్టన్ నాలుగో టీ20: అక్టోబర్ 30 – ఆక్లాండ్ ఐదో టీ20: నవంబర్ 1 – హామిల్టన్ తొలి వన్డే: నవంబర్ 4, 2026 – ఈడెన్ పార్క్, ఆక్లాండ్ రెండో వన్డే: నవంబర్ 7, 2026 – వెల్లింగ్టన్ మూడో వన్డే: నవంబర్ 10, 2

Original source: ntvtelugu.com
Read more on Kaizer News