Kaizer News

Chodavaram: చోడవరంలో కొండెక్కిన కూరగాయల ధరలు కిలో

Chodavaram: చోడవరంలో కొండెక్కిన కూరగాయల ధరలు కిలో ఉల్లి రూ.60!

· State - Telangana · hmtvlive.com

Chodavaram: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిపాయలు (పెద్దవి) రెండు వారాల వ్యవధిలో కిలోకి రూ.30లు పెరిగింది. రెండు వారాల క్రితం వరకు ఉల్లి ధర రూ.25 నుంచి రూ.30లు ఉండేది. గత వారం ఒకేసారి రూ.20లు పెరిగి కిలో రూ.50లు 2అయింది, శనివారం మరో రూ.10లు పెరిగి రూ.60లకు చేరింది. గత వారం కిలో టమాటా రూ.25 ఉంటే, ఈ వారం రూ.30లకు పెరిగింది. కాలీఫ్లవర్ ఒక్కొక్కటి రూ.30లు చొప్పున విక్రయిస్తే, ఈ వారం కిలోల లెక్కన విక్రయించారు.2 ఆగాకర కిలో రూ.120, బీన్స్ రూ.120, అల్లం కిలో రూ.160, చిక్కుడు కాయలు కిలో రూ.80లు, క్యారెట్, బీట్రూట్ కిలో రూ.50 చొప్పున విక్రయించారు. నల్ల వంకాయలు రూ.60లు, తెల్లవంకాయలు రూ.40లకు అమ్మారు. అలాగే బీరకాయలు కిలో రూ.50లు, పచ్చిమిర్చి రూ.60 విక్రయించారు. కూరగాయల ధరలు పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే- సామాన్యులు కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కూరగాయల రేట్లు ఉంటున్నాయని మొత్తానికి వ్యాపారస్తులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News