Kaizer News

రైతుల శ్రేయస్సు కోసమే సహకార సంఘాలు

రైతుల శ్రేయస్సు కోసమే సహకార సంఘాలు

· State - Telangana · prabhanews.com

ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి: షబ్బీర్ అలీ బిక్కనూర్, ఆంధ్రప్రభ : రైతుల శ్రేయస్సు కోసమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం మండలంలోని రామేశ్వరపల్లి గ్రామ సహకార సంఘం చైర్మన్ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ సహకార సంఘాలు వ్యాపారానికే పరిమితం కాకుండా రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నాయని తెలిపారు. పట్టా పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యులకు అవసరమైన స్వల్ప, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వం ఉన్న ప్రతి రైతుకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల అభ్యున్నతి కోసం సహకార సంఘాలు ఎంతగానో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్‌రెడ్డి రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. గత ప్రభుత్వం సహకార వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహకార సంఘాలను మరింత బలోపేతం చేసి రైతులకు చేరువగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక పథకాలను అమలు చేస్తున్నారని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు భరోసా పథకం కింద సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని గుర్తు చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందాల్సిన ఎరువులు పక్కదారి పట్టకుండా యాప్ విధానం ద్వారా రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రైతులు ప్రతిసారీ ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా పంట మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన సహకార వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అనంతరం సొసైటీ పాలకవర్గంతో షబ్బీర్ అలీ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సూర్యకాంతరెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, తిప్పాపూర్ సొసైటీ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి, అంతంపల్లి సొసైటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో సవితారెడ్డి, సొసైటీ సీఈవో శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పా

Original source: prabhanews.com
Read more on Kaizer News