Kaizer News

హోరాహోరీగా పీఆర్టీయూ ఎన్నికలు

· State - Telangana · sakshi.com

ఖలీల్‌వాడి : పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 366 ఓట్లు ఉండగా.. ఆయా మండలాల నుంచి తరలివచ్చిన 358 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి ఎంబెల్లి శంకర్‌, పొద్దుటూరి మోహన్‌రెడ్డి , ప్రధాన కార్యదర్శి పదవికి గంట అశోక్‌, గంగోని కిషన్‌, ఎం వెంకటేశ్వర్‌గౌడ్‌ పోటీపడ్డారు. అలాగే అసోసియేట్‌ అధ్యక్షులుగా అంకం నరేశ్‌, చిలుక శ్రీనివాస్‌, ఎంవీ సురేశ్‌ చంద్ర, హన్మారెడ్డి, ఉపాధ్యక్ష పదవికి గాండ్ల రాజశేఖర్‌, డి హన్మాండ్లు, కే కృష్ణమనోహర్‌రావు, అంజయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, సాయన్న, కార్యదర్శి స్థానా నికి అప్పెన్న కపిల్‌ కుమార్‌, ఏ రామకృష్ణ, ఎడ్ల శేఖర్‌, జిందం రవి, కే గోపాల్‌, శ్రీనివాసస్వామి, శ్రీనివాస్‌ పోటీలో పడ్డారు. మహిళ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 358 ఓట్లు పోల్‌కాగా కౌంటింగ్‌ ప్రక్రియ రౌండ్‌ల వారీగా అర్ధరాత్రి వరకు కొనసాగింది. మోహన్‌రెడ్డి, శంకర్‌ మధ్య రౌండ్‌ రౌండ్‌కు ఆధిప త్యం కొనసాగింది. చివరకు శంకర్‌ 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News