Shorts అన్నవరం: విశాఖపట్నం వైపు నుండి విజయవాడ వెళ్తున్న ఒక గూడ్స్ రైలు మధ్యలో ఎక్కిన సుమారు 30 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి, అన్నవరం రైల్వే స్టేషన్ వద్దకు వచ్చేసరికి రైలు పైకి ఎక్కాడు. అక్కడి నుండి స్టేషన్‌లోని రేకుల షెడ్డు పైకి దూకి హల్ చల్ చేశాడు. ఈ ఘటనతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, సదరు వ్యక్తిని పరిశీలించగా అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు, పైగా బాగా మద్యం తాగి ఉన్నట్లు గుర్తించారు. మైకంలో ఉండటంతో అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు వివరాలు ఏంటనే విషయాలపై అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అతన్ని సురక్షితంగా కిందకు దించేందుకు చర్యలు చేపట్టారు