Kaizer News

Wargal: క్యూనెట్ మోసం: హరికృష్ణ ఆత్మహత్య కేసుపై సీ

Wargal: క్యూనెట్ మోసం: హరికృష్ణ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ!

· State - Telangana · hmtvlive.com

Shorts సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం వేలూరుకు చెందిన బడుగు హరికృష్ణ (26) ఆత్మహత్య కేసు సీబీఐ దర్యాప్తుకు చేరింది. గత ఏడాది అక్టోబర్ 9న ఇంట్లో ఉరివేసుకుని హరికృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యూ‌నెట్ సంస్థలో సుమారు రూ.4.50 లక్షలు పెట్టుబడి పెట్టగా, డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనలా మరెవరూ మోసపోవద్దంటూ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై హరికృష్ణ తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వర్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థకు సంబంధించిన లావాదేవీలు ఇతర రాష్ట్రాలు, విదేశాలతో ముడిపడి ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో కేసును సీఐడీకి బదిలీ చేశారు. అనంతరం విదేశీ లావాదేవీల అంశాలు వెలుగులోకి రావడంతో కేసు సీబీఐకి బదిలీ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సీబీఐ అధికారులు నాగరాజుకు ఫోన్ చేసి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. క్యూ‌నెట్ సంస్థ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని తండ్రి అయిన నాగరాజు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News