Kaizer News

శివమ్‌ మీడియా కొత్త చిత్రం

శివమ్‌ మీడియా కొత్త చిత్రం

· Entertainment · ntnews.com

శివమ్‌ మీడియా కొత్త చిత్రం తెలంగాణ జానపద గీతాల ద్వారా గుర్తింపు పొందిన కిట్టు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం ప్రారంభమైంది. దిలీప్‌సాయి నాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్‌ మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ క్లాప్‌నిచ్చారు. ఆర్‌.పి.పట్నాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రతిభావంతులైన బృందంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చంద్రబోస్‌ అన్నారు. విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు ఈ చిత్రానికి కెమెరా: జనతా బబ్లూ, సంగీతం: మదిన్‌, నిర్మాతలు: ముని శివ, శివ మల్లాల, రచన-దర్శకత్వం: దిలీప్‌సాయి నాయక్‌

Original source: ntnews.com
Read more on Kaizer News