Kaizer News

అబద్ధాల వరద.. బీఆర్‌ఎస్‌పై బురద

అబద్ధాల వరద.. బీఆర్‌ఎస్‌పై బురద

· State - Telangana · ntnews.com

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ దృష్టిమరల్చేందుకే కేసీఆర్‌పై ఆరోపణలు రుజువుచేస్తే రాజీనామాకు రెడీ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలను అబద్ధాలకు వేదికగా మార్చి బీఆర్‌ఎస్‌పై బురదజల్లి విలువైన సమయాన్ని రేవంత్‌ సర్కార్‌ వృథా చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో ఆత్మస్తుతి.. పరనింద తప్పా ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. సభను ప్రజాస్వామ్యయుతంగా నడిపామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారనే భయంతో బీఆర్‌ఎస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్‌ దుశ్శాసన పర్వం సాగించి నడిరోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని నిప్పులు చెరిగారు. రూ. 200 కోట్ల విలువైన భూమిని తన తమ్ముడి కంపెనీ టెస్సెరాక్ట్‌కు కట్టబెట్టిన వ్యవహారంపై దృష్టిమరల్చేందుకే కేసీఆర్‌ కుటుం బంపై పనికిమాలిన ఆరోపణలు చేసిందని విమర్శించారు. అసెంబ్లీ లోపల, వెలుపల అధికార కాంగ్రెస్‌ దుర్మార్గంగా వ్యవహరించి ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చిందని మండిపడ్డారు. 483 పేజీలున్న క్యూర్‌ బిల్లుపై సమగ్ర చర్చలేకుండానే మండలిలో అరగంట, శాసనసభలో గంటలోగా ఆమోదించుకోవడం సర్కారు నిరంకుశ వైఖరికి అద్ధంపడుతున్నదని దుమ్మెత్తిపోశారు. మూడేండ్ల పాలనలో 420 హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగానే బ్లాక్‌ టీషర్టులు ధరించి అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ సభ్యులమంతా వెళ్లినట్టు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. డ్రెస్‌కోడ్‌ను సాకుగా చూపి అసెంబ్లీ గేటు వద్దకు రాకుండా బీఆర్‌ఎస్‌ సభ్యులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్‌కు బ్లాక్‌ టీషర్ట్‌తో రాహుల్‌ వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి పెయిడ్‌ బ్యాచ్‌లా మారి ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్‌ఎస్‌ గొంతునొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంపై చావు డప్పు పేరిట దాడులకు తెగబడ్డ కాంగ్రెస్‌ గూండాలకు పోలీసులు రోప్‌ పార్టీతో రక్షణ కల్పించారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ వద్దకు వెళ్తున్న తమ నాయకులను అడ్డుకోవడం కాంగ్రెస్‌ మార్క్‌ ప్రజాస్వామ్యానికి అద్దంపడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎదుట ‘మహిళా ప్రజాప్రతినిధులపై దౌర్జన్యాలకు పాల్పడ్డ పోలీసులపై చర్యలేదుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం కోరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి గెంటేసి కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయి అసెంబ్లీని నడిపించుకున్నాయని ఆరోపించారు. హామీల అమలుపై నిలదీస్తారనే భయంతోనే బీఆర్‌ఎస్‌ గొంతునొక్కారని ఆరోపించారు. 22-ఏ నుంచి ఆస్తులు తొలగించేందుకు కాంగ్రెస్‌ నేతలు 30 శాతం కమీష

Original source: ntnews.com
Read more on Kaizer News