Car Retrofitting: పెట్రోలు, డీజిల్ ధరలను భరించలేని వాహనదారులు ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. మొదట్లో CNG, LPG వైపు మొగ్గు చూపినా.. ఇప్పుడు అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లింది. అయితే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో పాత పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చు, ఈ విధానమే 'రెట్రోఫిటింగ్'. రెట్రోఫిట్ అంటే ఏమిటి? తయారీ సమయంలో వాహనానికి ఉన్న ఇంజిన్ లేదా ఇంధన వ్యవస్థను తీసివేసి.. దాని స్థానంలో కొత్త బ్యాటరీ & మోటార్ సాంకేతికతను అమర్చడాన్ని రెట్రోఫిటింగ్ అంటారు. గతంలో పెట్రోల్ కార్లకు CNG కిట్లు బిగించడం చూశాం. ఇప్పుడు అదే తరహాలో ఎలక్ట్రిక్ కిట్లను అమర్చుకునే కన్వర్షన్ ట్రెండ్ నడుస్తోంది. మీ వాహనం రోజూ కనీసం 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగితేనే రెట్రోఫిట్ చేసుకోవడం లాభదాయకం. సాధారణ కారును EVగా మార్చడానికి ప్రారంభ ధర సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అందుకే వ్యక్తిగత కార్ల కంటే రోజూ తిరిగే క్యాబ్స్, డెలివరీ వాహనాలకు ఇది చాలా గిట్టుబాటవుతుంది. మీ వాహనం కనీసం ఏడు నుంచి ఎనిమిది ఏళ్ల పాతదై ఉండి, మంచి కండిషన్‌లో ఉంటేనే EVగా మార్చుకోవాలి. కారు బాడీ తుప్పు పట్టకుండా ఉండాలి. మరో 10-15 రోడ్డుపై నడిచే సామర్థ్యం ఉందో, లేదో తనిఖీ చేసుకోవాలి. కారు ఫ్రేమ్ & ఛాసిస్ బలంగా ఉన్నాయో లేదో వర్క్‌షాప్‌లో పరీక్షించుకోవాలి. మీ వాహన మోడల్‌కు ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధ్రువీకరించిన EV కిట్ సరిపోతుందో, లేదో చూసుకోవాలి. భవిష్యత్తులో మీ పాత వాహన విడిభాగాలు దొరుకుతాయో, లేదో ముందే తెలుసుకోవడం మంచిది. ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్.. 204cc ఇంజిన్, 26.5hp పవర్.. Yamaha R2 రేటెంతో తెలుసా? మీ కారును EVగా మార్చాలనుకుంటే ముందుగా RTO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. RC, లైసెన్స్ & బిగించబోయే ఎలక్ట్రిక్ కిట్ వివరాలను సమర్పించి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చాక ఏ.ఆర్.ఏ.ఐ., సీ.ఐ.ఆర్.టి., ఏ.సీ.ఏ.టి. లేదా జీ.ఏ.ఆర్.సి. వంటి సంస్థల ఆమోదం పొందిన అధీకృత రెట్రోఫిటింగ్ కేంద్రాల్లోనే కిట్ అమర్చుకోవాలి. అనధికారిక కిట్లు వాడటం సురక్షితం కాదు. కిట్ అమర్చిన తర్వాత సదరు సంస్థ వాహనం పనితీరు, బ్రేకులు & ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను తనిఖీ చేసి ఇన్వాయిస్‌తో కూడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో వాహనాన్ని మళ్లీ RTO ఆఫీసుకు తీసుకెళ్లి తనిఖీ పూర్తి చేయించాలి. అప్పుడు, ఆ వాహనం RCలో ఇంధన రకాన్ని EVగా మారుస్తూ ఎండార్స్‌మెంట్ ఇస్తారు. ఆ తర్వాతే బీమా కూడా వర్తిస్తుంది. ఇది కూడా చదవండి: యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్! హైదరాబాద్‌లో CNG కిట్లు అమర్చే అధీకృత కేంద్రాలు అత్తాపూర్, బోయగూడ, నాగోల్, LB నగర్‌లో ఉన్నాయి. బైక్‌లు, ఆటోలు & సరుకు రవాణా వాహనాల కోసం EV కన్వర్షన్ కేంద్రాలు బొల్లారం, LB నగర్, తెల్లాపూర్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. డ్రైవర్లు ప్రతిరోజూ గంటల తరబడి వాహనం నడపుతూ, కొన్ని వందలసార్లు గేర్లను మారుస్తున్నారు