Kaizer News

మహాసభలను విజయవంతం చేయాలి

· State - Telangana · sakshi.com

ఖానాపూర్‌: ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని రాయల సుభాష్‌చంద్రబోస్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ (ఏఐకేఎంఎస్‌) నాలుగో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్‌, ని ర్మల్‌ జిల్లాల ప్రధాన కార్యదర్శి ఎల్‌ఆర్‌ ఉపాలి పి లుపునిచ్చారు. ఖానాపూర్‌లోని జగన్నాథరావు చౌరస్తాలో మహాసభల ప్రచార పోస్టర్‌ను శనివారం ఆవి ష్కరించి మాట్లాడారు. గ్రామీణ సంక్షేమ పథకాల పై జరుగుతున్న దాడులు, పేదల అభివృద్ధిని విస్మరించే విధానాలు, నిర్బంధం తదితర అంశాలపై మ హాసభలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలి పారు. మతపరమైన దాడులు, కుల, లైంగిక అసమానతలు, పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. మహాసభలకు 20రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హా జరుకానున్నారని తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోగు శేఖర్‌, కోశాధికారి కుడుదుల రాజేశ్వర్‌, జిల్లా కమిటీ సభ్యులు మానుక శ్రీనివాస్‌, గూట్ల ప్రసాద్‌, గోని స్వామి, నాయకులు రవి, మొహినొద్దీన్‌, భీమురావు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News