గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం శివారు ఇందిసమ్మ గుడి సమీపంలో పోలవరం కాలవనందు సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని పురుషుడి శవం పోలవరం కాలువ నీటిలో బోర్ల పడి ఉండగా కొడవలి గ్రామ వి ఆర్ ఓ పద్మశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు పై కొడవలి గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బంది సహకారంతో గొల్లప్రోలు పోలీసు గుర్తుతెలియ శవంను నీటిలో నుండి బయటకు తీయించి తదుపరిచర్య నిమిత్తం శవంను అంబులెన్స్ లో పిఠాపురం గవర్నమెంట్ హాస్పటల్ కు శవపరీక్ష నిమిత్తము పంపడం అయినది. సదరు యొక్క సంఘాటనపై గొల్లప్రోలు ఎస్ ఐ . రామకృష్ణ కేసు నమోదు చేసి మృతుని వివరాలు గురించి దర్యాప్తు చేయుచున్నారు