Kaizer News

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

· State - Telangana · prabhanews.com

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా అండగా నిలుస్తోందని బడా భీమ్‌గల్ గ్రామ సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధిని, ఉపసర్పంచ్ శంకర్‌గౌడ్ అన్నారు. భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ గ్రామంలో శనివారం కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దాకడి సుజాత, కుమ్మరి బాలమణి, చిత్తరి అనసూయ, ఆరపల్లి లక్ష్మి, ఈర్ల సుమలతకు మంజూరైన చెక్కులను సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధిని, ఉపసర్పంచ్ శంకర్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటునందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాహుల్, జీపీవో విశ్వాస్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కంతం శంకర్, వార్డు సభ్యులు కొండూరు నవీన్, అరుణ్, మల్లెల శ్రీకాంత్, దాస్, మానస, లత, సత్యవతి, రాజ్‌కుమార్, సుమన్, పెద్దోళ్ల మానస, జి. గీత, కారోబార్లు శేఖర్, నర్సయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News