Kaizer News

హీరోగా... విలన్‌గా..!

హీరోగా... విలన్‌గా..!

· Entertainment · sakshi.com

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథనం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని, వివిధ కాలమానాల్లో సాగుతుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్‌ వినిపిస్తోంది. అదేంటంటే... ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్‌ రోల్స్‌ చేస్తున్నారట అల్లు అర్జున్‌. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్‌ రోల్‌ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్‌గా అల్లు అర్జున్‌ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్‌ రోల్‌లో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News