Kaizer News

Annamayya: బి.కొత్తకోటలో యువరైతు దారుణ హత్య

Annamayya: బి.కొత్తకోటలో యువరైతు దారుణ హత్య

· State - Telangana · hmtvlive.com

Shorts అన్నమయ్య జిల్లా: బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం నాయనబావి ప్రాంతంలో యువరైతు గంగిరెడ్డి గోపాల్‌రెడ్డి (40) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం బోరు వద్ద ఒంటరిగా ఉన్న గోపాల్‌రెడ్డిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. అతడిని కాళ్లు, చేతులు కట్టేసి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఇనుపరాడ్లు, బండరాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన గోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆలస్యంగా విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News