Kaizer News

TG | తమ్ముడిని హత్య చేసిన అన్న…

TG | తమ్ముడిని హత్య చేసిన అన్న…

· State - Telangana · prabhanews.com

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వరంగల్‌ 16వ డివిజన్‌ గరీబ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న చేతిలో తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. గరీబ్‌నగర్‌కు చెందిన ప్రసాద్‌, ప్రవీణ్‌ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబ విషయాలపై వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చింది. ఆవేశంలో ప్రసాద్‌ తన తమ్ముడు ప్రవీణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ప్రవీణ్‌ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులు, హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది

Original source: prabhanews.com
Read more on Kaizer News