Kaizer News

రాత్రికి రాత్రి దానం యూటర్న్‌

రాత్రికి రాత్రి దానం యూటర్న్‌

· State - Telangana · ntnews.com

నిన్నటికి నిన్న ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ సవాల్‌ రోజు తిరుగకుండానే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ నాగేందర్‌ నిర్ణయం మార్పు వెనుక అనూహ్య మలుపులు ఎన్నికల్లో కొట్లాడుదామన్న సీఎం మాటపై నమ్మకం లేదా? లేక ‘ముఖ్య’నేత తెర వెనక చక్రం తిప్పడమే కారణమా? ఉప ఎన్నికలో రోహిన్‌రెడ్డిని దించుతారనే అనుమానమా? హైదరాబాద్‌ రాజకీయాలను వేడెక్కిస్తున్న వరుస పరిణామాలు హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): అంగీ మార్చినంత సులువుగా దానం నాగేందర్‌ పార్టీ కండువాలు మార్చుతారనేది ఇప్పటిదాకా అందరికీ తెలిసిన సత్యం. పార్టీనే కాదు… రాత్రికి రాత్రి మాటను సైతం అలవోకగా మారుస్తానని ఆయన తాజాగా నిరూపించుకున్నారు. బీఆర్‌ఎస్‌ జెండా మీద ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచి కేవలం మూడు నెలల్లోనే కాంగ్రెస్‌లోకి దూకిన దానం నాగేందర్‌ ఎపిసోడ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు హైదరాబాద్‌ నగర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై శుక్రవారం స్పందించిన దానం ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ కాలు దువ్వారు. కానీ ఒక్కరోజు గడువగానే ఈ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దానం కచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా తాను ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ శనివారం మధ్యాహ్నానికి సీన్‌ మారిపోయింది. నాగేందర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) వేయడానికి దారితీసిన అంతర్గత రాజకీయ పరిణామాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు ఎదురైన అనుభవమే ఖైరతాబాద్‌లో తనకు పునరావృతం అవుతుందేమోనన్న అనుమానంతోనే దానం ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ‘ముఖ్య’నేతను నమ్ముకొకుని పార్టీలోకి వచ్చినప్పటికీ.. కిందిస్థాయి అధికారి కూడా తన మాట వినకపోవడం వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉన్నదనే భయాందోళనే ఆయన యూటర్న్‌ తీసుకొనేందుకు కారణమై ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తన రాజకీయ జీవితంలో ఏకంగా నాలుగు పర్యాయాలు పార్టీలు మార్చిన దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా రెండు రోజుల కిందట హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ అంశాన్ని కొంతకాలం సాగదీసి ఈసారికి ఎలాగోలా నెట్టుకురావాలని ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. ఉప ఎన్నికను తప్పించుకొనేందుకు చివరకు చేరిన పార్టీ ప్రభుత్వంమీదా ఆరోపణలు చేస్తూ బీఆర్‌ఎస్‌ను పరోక్షంగా ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. హైకోర్టు తీర్పు అనంతరం.. ఫైటింగ్‌ తనకు కొత్త కాదంటూ భారీ డైలాగులు వల్లించిన నాగేందర్‌ ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాననే సవాల్‌ విసిరి చివరకు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నారంటే తెర వెనక ఆసక్తికర కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు. చాలాకాలంగా అంతర్మథనంలో దానం బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన మూడు నెలలకే దానం కాంగ్రెస్‌లోకి దూకడం వెనుక అధికార దాహం ఉందనేది బహిరంగ రహస్యం. వాస్తవానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస

Original source: ntnews.com
Read more on Kaizer News