Kaizer News

దానంపై హైకోర్టు వేటు

దానంపై హైకోర్టు వేటు

· State - Telangana · sakshi.com

ఆయన పార్టీ ఫిరాయించినట్లు నిర్ధారణ.. శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటన అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ సీజే ధర్మాసనం సంచలన తీర్పు 2024 ఏప్రిల్‌ 23 నుంచి ఖైరతాబాద్‌ నియోజకవర్గ స్థానం ఖాళీగా ఉన్నట్లేనని వెల్లడి స్పీకర్‌ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతి పంపాలని రిజిస్ట్రీకి ఆదేశం అప్పీలుకు వీలుగా తీర్పు అమలు నిలిపివేయాలన్న దానం న్యాయవాది ఊరటనివ్వని ధర్మాసనం.. రాష్ట్ర చరిత్రలో కోర్టు వేటుపడ్డ తొలి ఎమ్మెల్యేగా నాగేందర్‌ సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. బీఆర్‌ఎస్‌ సభ్యుడిగా కొనసాగుతూ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 191 (2), రెడ్‌విత్‌ పదవ షెడ్యూల్‌లోని పేరా 2 (1)ఏ ప్రకారం 2024 ఏప్రిల్‌ 23 నుంచి రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. దానం పార్టీ మారలేదంటూ మార్చిలో స్పీకర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రిట్‌ పిటిషన్లను అనుమతించింది. బీఆర్‌ఎస్‌ సభ్యుడిగా ఉంటూ 2024లో కాంగ్రెస్‌ నుంచి సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్‌ పోటీ చేశారని హైకోర్టు గుర్తుచేసింది. సంబంధిత శాసనసభ నియోజకవర్గ స్థానం ఖాళీగా మారినట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను శాసనసభ స్పీకర్‌ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అప్పీలుకు వీలుగా ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ దానం తరఫు న్యాయవాది అభ్యర్థించినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ప్రత్యేక ధర్మాసనం విచారణ ముగించింది. పార్టీ మారినట్లు ప్రకటిస్తూ ఓ ఎమ్మెల్యేపై ఉన్నత న్యాయస్థానం అనర్హత వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. స్పీకర్‌ తీర్పును బీఆర్‌ఎస్, బీజేపీ సవాల్‌ చేయడంతో.. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరినందున ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంపై విచారణ చేపట్టిన స్పీకర్‌ (ట్రిబ్యునల్‌ చైర్మన్‌ హోదాలో) దానం నాగేందర్‌ చట్టపరంగా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం గత నెల 21న తీర్పు రిజర్వు చేసింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ స్పెషల్‌ బెంచ్‌ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తీర్పు కాపీలో ధర్మాసనం పేర్కొన్న కీలకాంశాలు.. కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభకు.. 2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ శాసనసభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. 2024 ఏప్రిల్‌ 23 నుంచి ఆయన అనర్హత వర్తిస్తుంది. దీంతో ఆయన ప్రాతిన

Original source: sakshi.com
Read more on Kaizer News