Kaizer News

గాంధారి గర్భం

· State - Telangana · ntnews.com

ధాత్రి అద్దంలో చూసుకుంది. తన ప్రతిబింబంపై ఓ మసక తెర కప్పినట్లు అనిపించింది. ఆమె తలపై ఎవరివో చేతులు వేగంగా కదులుతూ ఉన్నాయి. ఆమె కాళ్లనూ, చేతులనూ బంధించిన తాళ్లు ఆ పరాయి చేతులలో ఉండటంతో.. తనో తోలుబొమ్మలా ఆడుతూ ఉంది. తన గర్భధారణ ఓ ప్రహసనంగా ఎందుకు మారింది? గర్భం బయట జరిగింది గర్భధారణ అవుతుందా? అందుకే.. టెస్ట్‌ట్యూబ్‌ బేబీ అన్నారా? అలా పుట్టిన బిడ్డకు పరీక్ష నాళికే తల్లి అవుతుంది కానీ, తను కాదు కదా? ఇందులోని ఏ ప్రశ్నకీ ఆమె దగ్గర సమాధానం లేదు. చూడటానికి పడకగది బహు విశాలం. కానీ, అంతా ఇరుకిరుకుగా అనిపిస్తోంది.. గదిలోనా? మదిలోనా?

Original source: ntnews.com
Read more on Kaizer News