Kaizer News

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికాకు శాశ్వత నియంత్రణ

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికాకు శాశ్వత నియంత్రణ

· National - India · ntnews.com

డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌లతో ఒప్పందం వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 19: గ్రీన్‌ల్యాండ్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. గ్రీన్‌ల్యాండ్‌, డెన్మార్క్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్‌ భద్రతపై వాషింగ్టన్‌కు శాశ్వత నియంత్రణ కల్పిస్తూ, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఇకపై రష్యా, చైనా దేశాలు స్థావరాలు ఏర్పాటు చేయకుండా డెన్మార్క్‌తో ఒప్పందం జరిగిందన్నారు. ఇక నుంచి యూఎస్‌ శత్రుదేశాలకు గ్రీన్‌ల్యాండ్‌లో బేస్‌లు, సైనిక ఉనికి ఉండరాదని, తమ రాతపూర్వక అనుమతి లేకుండా సున్నిత పెట్టుబడులు పెట్టరాదని పేర్కొన్నారు. ఇది జీవితకాల ఒప్పందమని, ఇకపై ఈ ప్రాంతానికి చైనా, రష్యాలు బలగాలను పంపలేవని ట్రంప్‌ పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News