Kaizer News

NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ 2026 షెడ్యూల్‌ ఇదే..

NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ 2026 షెడ్యూల్‌ ఇదే.. సెప్టెంబర్‌ 3 నుంచే రిజిస్ట్రేషన్లు

· State - Telangana · tv9telugu.com

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 29: NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ కోసం సెప్టెంబర్‌ 3 నుంచి రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌, సాయంత్రం 6 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో చాయిస్‌ ఫిల్లింగ్‌ సెప్టెంబర్‌ 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. రౌండ్‌-2 చాయిస్‌ లాకింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 8 సాయంత్రం 4 గంటల నుంచి సెప్టెంబర్‌ 9 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు తాము నమోదు చేసిన ఆప్షన్లను లాక్‌ చేయాల్సి ఉంటుంది. చాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి, నిర్ణీత సమయంలోపు చాయిస్‌లను లాక్‌ చేయడం చాలా ముఖ్యం. అభ్యర్థులు నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా MCC సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 11న NEET UG Round 2 Seat Allotment Result విడుదల చేయనున్నారు. సీటు కేటాయింపు పొందిన అభ్యర్థులు తమ అలాట్‌మెంట్‌ వివరాలను MCC అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. రౌండ్‌ 2లో సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 12 నుంచి 18లోపు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్‌ చేసి అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం చేరిన అభ్యర్థుల వివరాలను MCC, సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్‌ అధికారులు సెప్టెంబర్‌ 19న వెరిఫై చేస్తారు. రౌండ్‌-1లో సీటు రాని అభ్యర్థులు MCC నిబంధనల ప్రకారం రౌండ్‌-2లో పాల్గొనవచ్చు. అలాగే రౌండ్‌-1లో సీటు పొంది, సీటును అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని Float ఆప్షన్‌ ఎంచుకున్న అభ్యర్థులు కూడా రౌండ్‌-2లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే రౌండ్‌ 1 సీటును Freeze చేసిన అభ్యర్థులు అదే సీటును కొనసాగిస్తారు. వారికి రౌండ్‌ 2లో అప్‌గ్రేడేషన్‌ కోసం పరిగణన ఉండదు. రౌండ్‌-2లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, ఫీజు చెల్లించాలి. అనంతరం అందుబాటులో ఉన్న సీట్లను పరిశీలించి కాలేజీ, కోర్సుల వారీగా ఆప్షన్లు నమోదు చేయాలి. చాయిస్‌ లాకింగ్‌ గడువు ముగిసేలోపు ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. కౌన్సెలింగ్‌ తేదీలు, సీట్ల లభ్యత, అర్హత, ఫీజులు తదితర అంశాల్లో చివరి నిర్ణయం MCC అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారమే ఉంటుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు MCC అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News