Kaizer News

వెంకటాపురం: పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ ఆకస్మిక తనిఖీ చేసి ఐట

వెంకటాపురం: పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ ఆకస్మిక తనిఖీ చేసి ఐటీడీఏ పీవో

· Health · v6velugu.com

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏధిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో లెనిన్‌‌‌‌‌‌‌‌ వత్సల్‌‌‌‌‌‌‌‌ టొప్పో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌, విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరాపై ఆరా తీశారు. మందుల నిల్వ, గడువు తేదీలను పరిశీలించి స్టాక్‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని సూచించారు. ఇన్‌‌‌‌‌‌‌‌పేషెంట్‌‌‌‌‌‌‌‌ వార్డులు, మరుగుదొడ్లను పరిశీలించి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News