Kaizer News

పౌలిని శుభారంభం క్రెజికోవాకు షాక్‌

· Sports · ntnews.com

సీజన్‌ నాలుగో గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఇటలీ అమ్మాయి జాస్మిన్‌ పౌలిని శుభారంభం చేసింది. ఆదివారం లూయిస్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి పోరులో పౌలిని.. 6-3, 3-6, 6-4తో వెరోనిక ఎర్జావెక్‌ (స్లోవేనియా)ను ఓడించింది. మరో పోరులో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ బార్బొరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు మొదటి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. అన్‌సీడెడ్‌ కమిల్లా రఖిమొవా (ఉక్రెయిన్‌).. 7-6 (7/4), 6-2తో క్రెజికోవాను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది

Original source: ntnews.com
Read more on Kaizer News