Kaizer News

iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!

· National - India · ntvtelugu.com

iPhone 18 Sales: యాపిల్ కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. ఆ క్రేజే వేరు! తాజాగా భారత్‌లో ఐఫోన్ 18 సిరీస్ సేల్స్ ప్రారంభమవ్వడంతో ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కొత్త ఫోన్‌ను ఎలాగైనా సరే అందరికంటే ముందే సొంతం చేసుకోవాలని అభిమానులు వేకువజాము నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు. స్టోర్ తలుపులు తెరుచుకోగానే యాపిల్ సిబ్బంది చప్పట్లు, కేరింతలతో కస్టమర్లకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో ఎటు చూసినా ఇదే ఉత్సాహం కనిపించింది. సూరత్ నుంచి ముంబైలోని BKC స్టోర్‌కు వచ్చిన ఒక అభిమాని ఏకంగా 10 నుంచి 12 గంటలు కాచి కూర్చుని, దేశంలోనే మొదటి ఫోన్‌ను చేతిలోకి తీసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సంబరాలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. భారీ ధరలపై మీమ్స్, ట్రోల్స్ వచ్చినా.. యాపిల్‌కు ఉన్న క్రేజ్ ముందు అవేవీ నిలవలేకపోయాయి

Original source: ntvtelugu.com
Read more on Kaizer News