Kaizer News

జన్వాడలో ఉద్రిక్తత!.. ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు

జన్వాడలో ఉద్రిక్తత!.. ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్‌ నాయకుల యత్నం

· State - Telangana · ntnews.com

అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను నిలువరించిన పోలీసులు ఇది దుర్మార్గమైన చర్య: లీగల్‌ అడ్వైజర్‌ రాజేశ్వర్‌రావు షాబాద్‌, సెప్టెంబర్‌ 19: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్‌ నాయకులు యత్నించడంతో వారిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఫాంహౌస్‌ పరిసరాల్లోకి పోలీసు బలగాలు పెద్ద ఎత్తు న చేరుకున్నాయి. జన్వాడలోని ప్రదీప్‌రెడ్డి కి చెందినదిగా భావిస్తున్న ఫామ్‌హౌస్‌ ము ట్టడికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. ఫాంహౌస్‌ను కేటీఆర్‌కు లీజ్‌కి మాత్రమే ఇచ్చానని ఓనర్‌ ప్రదీప్‌రెడ్డి రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో వెల్లడించా రు. అయినా కాంగ్రెస్‌ నాయకులు దౌర్జన్యంగా శనివారం ఫామ్‌హౌస్‌పై దాడి చేసేందుకు కుట్రలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకునేందుకు షాబాద్‌ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితోపాటు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున జన్వాడకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఫామ్‌హౌస్‌కు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు చుట్టు పక్కల ఉన్న దుకాణాలను మూసి వేయాలని ప్రజలను సైతం ఇబ్బంది పెట్టారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. కాంగ్రెస్‌ నేతల బస్సుకు అడ్డంగా నిలబడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు దౌర్జన్యంగా ఫామ్‌హౌస్‌పై దాడికి రావడం దుర్మార్గమైన చర్య అని లీగల్‌ అడ్వైజర్‌ రాజేశ్వర్‌రావు మండిపడ్డారు. ప్రదీప్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఎలాంటి నాలాలు, కబ్జాలు లేవని, చట్టపరంగానే 2019లో ఈ భూమిని కొన్నారని తెలిపారు. ఎలాంటి కబ్జాలు ఉన్నా ప్రభుత్వం న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News