Kaizer News

గంటలో 106 పుల్-అప్స్‌ : చీరకట్టుతో నటి ఫిట్‌నెస్‌

గంటలో 106 పుల్-అప్స్‌ : చీరకట్టుతో నటి ఫిట్‌నెస్‌ ఫీట్‌

· State - Telangana · sakshi.com

ప్రముఖ నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) తన ఫిట్‌నెస్‌తో మరోసారి అభిమానులకు ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కేరళ కసవు చీరకట్టులో కేవలం ఒక గంటలోనే 106 పుల్-అప్స్ తీసి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించారు. 'వరల్డ్ పుల్ అప్ డే' (World Pull Up Day) సందర్భంగా ఆమె ఈ అద్భుతమైన ఫీట్‌ను చేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశారు. జిమ్‌లోని పుల్-అప్ బార్ కింద చీరలో కసరత్తులు చేయడం సంయుక్తకు కొత్తేమీ కాదు. కానీ చీరకట్టులో గంటలో ఏకంగా 106 పుల్-అప్స్ తీయడం విశేషం. ఫిట్‌నెస్‌ , జిమ్‌ కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా తమ శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చాటిచెప్పడమే తన ఉద్దేశమని సంయుక్త పేర్కొన్నారు.తొలి పుల్-అప్ నేర్చుకోవడానికే తనకు దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని, నిరంతర పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అంతేకాదు ‘‘మహిళలు పురుషులను అధిగమించాలనో, ఓడించాలనో జిమ్‌కు వెళ్లరు; తమ సొంత భయాలను జయించడానికే వెళ్తారు. అందుకే, ఒక మహిళ 'పుల్-అప్' (pull-up) చేయడం చూసినప్పుడు, నాకది కేవలం ఒక వ్యాయామంలా మాత్రమే కనిపించదు. దాన్ని చూస్తూ, 'బహుశా నేను కూడా అలా చేయగలనేమో' అని ఆలోచిస్తున్న వేలాది మంది మహిళలు నాకు కనిపిస్తారు." అంటూ మహిళలకు స్ఫూర్తినివ్వడం విశేషం. ఈ వీడియోపై నెటిజన్లు ఆమెను "విమెన్‌ - జిమ్ ఎడిషన్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుల్-అప్స్ అత్యంత కష్టమైన బాడీవెయిట్ వ్యాయామాలలో ఒకటి అంటారు నిపుణులు. ఇది భుజాలు, వెన్నెముక, చేతులు, కోర్, గ్రిప్ స్ట్రెంత్ వంటి అనేక భాగాలపై ఒకేసారి పనిచేస్తుంది. అయితే సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ చూసిన బిగినర్స్‌ సరైన బలం పెంచుకోకుండా నేరుగా ఫుల్ పుల్-అప్స్ ప్రయత్నిస్తే టెండాన్ స్ట్రెయిన్, భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ బ్యాండ్స్, అసిస్టెడ్ పుల్-అప్స్ లేదా ఇన్‌క్లైన్ పుల్-అప్స్‌తో క్రమంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంటుందని గమనించాలి. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్‌జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు? తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..! కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు

Original source: sakshi.com
Read more on Kaizer News