Kaizer News

సైబర్ మోసాల బాధితులకు సత్వర సహాయం

సైబర్ మోసాల బాధితులకు సత్వర సహాయం

· State - Telangana · prabhanews.com

మేడిపల్లి డీఎస్పీ రాములు మేడిపల్లి ఆంధ్రప్రభ: ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని, మేడిప‌ల్లి డీఎస్పీ పి రాములు సిబ్బందికి సూచించారు. ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో మర్యాదగా,గౌరవంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని, ఫిర్యాదులను సక్రమంగా స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా పోలీస్ సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్ మోసాలకు గురయ్యే బాధితులకు సత్వర సహాయం అందించి, ఫిర్యాదులను బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న గణేష్ ఉత్సవాలు, మండపాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. కార్యక్రమంలో మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News