తెలంగాణలో సామాన్య ప్రజలపై ధరల పిడుగు పడింది. ఈ ఏడాది జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.32 శాతంగా నమోదైంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణా రాష్ట్రంలో నమోదైన ద్రవ్యోల్బణం అత్యధికం. జనవరి నుంచి జులై వరకు వరుసగా ఏడు నెలల పాటు తెలంగాణ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రం రాష్ట్రంగా కొనసాగింది. తెలంగాణ శాసనమండలిలో అనూహ్య పరిణామం: ఎకాఎకిన ఎమ్మెల్సీపై వేటు వేసిన పార్టీ పెరుగుతూ పోతున్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నుండి ఇప్పటివరకు రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. జనవరిలో 4.92 శాతం, ఫిబ్రవరిలో 5.02, మార్చిలో 5.83, ఏప్రిల్‌లో 5.81, మేలో 6.15, జూన్‌లో 6.36, జులైలో 6.32 శాతంగా ఉంది. జూన్‌తో పోలిస్తే కొద్దిగా తగ్గినా 6 శాతానికి పైగా ఉండటంతో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా తెలంగాణా తొలి స్థానంలోనే నిలిచింది.గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత కష్టంగా ఉంది. అమెరికాలో తెలంగాణ అమ్మాయి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్ చేసిన పోలీసులు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా వినియోగదారుల ధరల సూచిక విలువ జులైలో గ్రామీణ ద్రవ్యోల్బణం 6.86 శాతం, పట్టణాల్లో 5.92 శాతం నమోదైంది. వ్యవసాయ కుటుంబాలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలపై ఈ పెరుగుదల ప్రభావం ఎక్కువగా పడుతోంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ 5.72%, తమిళనాడు 5.44%, మధ్యప్రదేశ్ 4.91%, కర్ణాటక 4.89%తో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతంగా ఉంది. తెలంగాణలో వినియోగదారుల ధరల సూచిక విలువ 110.06 పాయింట్లుగా నమోదై ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం నిత్యావసరాలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడమే అని తెలుస్తోంది. పాలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు రవాణా ఖర్చుతో కలిపి బాగా ఖరీదుగా మారుతున్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో ఉల్లి రూ.10 ఉంటే ఇక్కడ రూ.30కి అమ్ముతున్నారు. కొత్త వినియోగదారుల ధరల సూచిక శ్రేణి కూడా ఈ పెరుగుదలకు ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఆదాయం పెరగని సామాన్య కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితిని కంట్రోల్ చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు