Shorts News Analysis: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు, పార్టీ ఫిరాయింపులు మరియు రాబోయే ఎన్నికలపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ పాల్గొని మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, పార్టీ ఫిరాయింపుల చట్టం పకడ్బందీగా అమలు కావాల్సిన అవసరం ఉందని నుమాన్ పేర్కొన్నారు. ఒక పార్టీ బీఫామ్‌పై గెలిచిన తర్వాత మరో పార్టీ టికెట్‌పై పోటీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఎక్కడ కూడా బై ఎలక్షన్లు రాబోవని ఆయన స్పష్టం చేశారు. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను