Kaizer News

పాతపేటలో ఘనంగా ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకలు..

పాతపేటలో ఘనంగా ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకలు..

· State - Telangana · prabhanews.com

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలోని పాతపేట వీధిలో మల్లేపల్లి వసంతమ్మ, వెంకటప్ప దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలను మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోరం మహేష్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొక్కు లింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గూడు లేని పేద ప్రజలకు సొంత గృహం నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం లబ్ధిదారులను కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కు మల్లేష్‌, సువర్ణ రవికుమార్‌, మాజీ వార్డు సభ్యుడు అశోక్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాఘవేందర్‌గౌడ్‌, బండి నరేష్‌, అంజాద్‌ టైలర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News