Kaizer News

హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?

హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?

· State - Telangana · sakshi.com

ఉదయాన్నే ఆఫీస్‌ క్యాబ్‌ కోసం ఎదురుచూడక్కర్లేదు. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి టైమ్‌ వేస్ట్‌ చేయక్కర్లేదు. ఇంట్లో హాయిగా కాఫీ తాగుతూ లాప్‌టాప్‌ ఆన్‌ చేస్తే చాలు... ఆఫీస్‌లో అడుగుపెట్టినట్లే... అటెండెన్స్‌ పడినట్లే... ప్రపంచాన్ని చుట్టేసిన ‘కరోనా’ కార్పొరేట్‌ రంగానికి నేర్పిన అతిపెద్ద పాఠం ‘‘హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌’’ వారంలో మూడు రోజులు డెస్క్‌ వర్క్, రెండు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌... వారాంతాల్లో సరదాలు... అసలు ఈ సరికొత్త సంస్కృతి ఉద్యోగుల జీవితాలను, కంపెనీల భవిష్యత్తును ఎలా మార్చింది? మారుస్తోంది? ఒక ప్రత్యేక కథనం. ఎక్కడ పనిచేస్తున్నారనేది కాదు... ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు... ఔట్‌పుట్‌ ఎంత వచ్చిందనేదే ముఖ్యం అంటున్నాయి నేటి గ్లోబల్‌ కంపెనీలు. నాలుగు గోడల మధ్య మూస ధోరణిలో ఆఫీసులో పనిచేయడం... లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో విసిగి పోవడం వంటిæరోజులు ముగిశాయి. ఇప్పుడు కార్పొరేట్‌ ప్రపంచంలో హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ ఒక ట్రెండ్‌గా మారింది. సంస్థల ఉత్పాదకత, ఉద్యోగుల సౌకర్యంతో పాటు లైఫ్‌ను సమన్వయం చేస్తూ ఈ నూతన పని సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఫలితమే ఫైనల్‌! ఉద్యోగులు తమ పనిదినాలను ఇల్లు, ఆఫీసు మధ్య పంచుకునే వెసులుబాటే హైబ్రిడ్‌ వర్క్‌. ఈ విధానంలో ఉద్యోగులు తమ సౌకర్యాన్ని బట్టి ఆఫీసు నుంచి, ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకునే వీలును కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఏ ప్రాంతం, ఏ దేశం అనే వాటితో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను ఆధారంగా చేసుకుని ఉద్యోగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పని ఎక్కడి నుంచి చేసినా ఫలితమే ఫైనల్‌ అనేది ఈ ఆధునిక విధానంలోని ముఖ్య ఉద్దేశం. డిజిటల్‌ టూల్స్‌ సహాయంతో సాధించిన విజయాలను చూసిన కంపెనీలు ఇప్పుడు దీనిని శాశ్వత మోడల్‌గా మారుస్తున్నాయి. కాఫీషాప్‌ ఆఫీసైతే! ఒకప్పుడు ఆఫీస్‌ అంటే నాలుగు గోడల మధ్య అమర్చిన డెస్క్‌లు, వరుసగా కూర్చునే ఉద్యోగులు. నిర్దిష్టమైన పని వేళలు. కానీ ఇప్పుడది పాత పద్ధతయ్యింది. ఇంటి లివింగ్‌ రూమ్, నచ్చిన కాఫీ షాప్, పల్లెలోని ప్రశాంతమైన వాతావరణం... ప్రదేశం ఏదయినా లాప్‌టాప్, మంచి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు, ప్రతి చోటూ ఒక వర్క్‌స్పేస్‌గా మారిపోతోంది. రెండు పడవలపై ప్రయాణం! సోమవారం పొద్దున్నే సగం తెరిచిన కళ్లతో అలారం సైలెంట్‌ చేయడం... ఉదయం 8:15 గంటలకు బంపర్‌–టు–బంపర్‌ ట్రాఫిక్, హారన్ల గోల మధ్య ప్రెజెంటేషన్‌ డెక్‌ గురించి ఆలోచించడం. అదే బుధవారం ఉదయం... హాయిగా ఉదయం 8:30 గంటలకు లేచి, చేతిలో కాఫీ కప్పుతో లాప్‌టాప్‌ ఆన్‌ చేస్తూనే, పక్కన ‘నాన్నా.. నా బార్బీ బొమ్మ కనిపించడం లేదు!’ అని అరిచే నాలుగేళ్ల చిన్నారిని శాంతింపజేయడం. ఒకే మనిషి... ఒకే ఉద్యోగం... కానీ రెండు వేర్వేరు ప్రపంచాలు! ఐటీ ఉద్యోగి జీవితంలో ‘హైబ్రిడ్‌ వర్క్‌’ తెచ్చిన తిప్పలివి. ఆఫీస్‌ రోజున అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌లో గమ్యం చేరుకోవడం ఒక యుద్ధమైతే... ఇంటి నుంచి పనిచేసే రోజున ‘హోమ్‌’కి, ‘వర్క్‌’కి మధ్య గోడలు కూలిపోయి, పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఆందోళన, ఒకవేళ పూర్తయినా ‘ఆఫీస్‌ ముగిసింది’ అనే మానసిక భావన రాదు. వీకెండ్‌లో కూడా మె

Original source: sakshi.com
Read more on Kaizer News