Kaizer News

మరో కియారాను చూస్తారు!

మరో కియారాను చూస్తారు!

· Entertainment · sakshi.com

పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. పేరెంట్‌హుడ్‌... ఇలా జీవితంలో ఎన్ని కొత్త దశలు వచ్చినా కెమెరాకు మాత్రం కియారా అద్వానీ బ్రేక్‌ చెప్పలేదు! వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, నటిగా తన ప్రయాణాన్నీ అంతే జోరుగా కొనసాగిస్తోంది. ఈ నిరంతర ప్రయాణం వెనుక ఉన్న విషయాలన్నీ ఆమె మాటల్లోనే! పేరులో చిన్న ట్విస్ట్‌! నా అసలు పేరు ఆలియా. సినిమాల్లోకి రాకముందు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ‘అంజానా అంజానీ’లో ప్రియాంక చోప్రా పోషించిన కియారా పాత్ర నాకు చాలా ఇష్టం. సల్మాన్ ఖాన్ కూడా అదే సూచించారు. అలా... నాకు ‘కియారా’ పేరు ఫిక్స్‌ అయిపోయింది. టీచర్‌ అవుతాననుకున్నా! మా అమ్మ టీచర్‌ కావడంతో.. చిన్నప్పుడు నేను కూడా అచ్చం అమ్మలాగే టీచర్‌ అవుదామనుకున్నా. కానీ జీవితం మనం అనుకున్నట్టే ఉండదు కదా! పిల్లలకు చదువు చెప్పాల్సిన నేను... ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాను. ఇన్నేళ్లకు... వర్షంలో తడిశా! ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు పక్కా సినిమాటిక్‌ వర్షపు సీన్ చేయలేదు. ‘టాక్సిక్‌’లో ఆ చాన్స్ వచ్చింది. స్క్రీన్ పై వర్షంలో తడుస్తూ కనిపించడం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది కదా... కానీ షూటింగ్‌ సమయంలో మాత్రం ‘ఇంకెంతసేపు ఈ వర్షం!’ అనిపిస్తుంది! అది కనిపిస్తే డైట్‌కి బై చెప్తా! ఫిట్‌గా ఉండటానికి డైట్‌ చేస్తాను కానీ... తిండిని పూర్తిగా వదిలేయలేను! ముంబై మసాలా టోస్ట్‌ నా చిన్నప్పటి ఫేవరెట్‌. ఢిల్లీకి వెళ్తే మటర్‌ కుల్చా తినాల్సిందే. ఇంట్లో చేసే సింధీ వంటకాలంటే ఇంకా ఇష్టం. రాత్రి డార్క్‌ చాక్లెట్‌ కనిపిస్తే మాత్రం నా డైట్‌ కాస్త నన్ను వదిలేస్తుంది! కెరీర్‌కు ముందు, తర్వాత! ‘టాక్సిక్‌’ సినిమాతో నేను ఇంతకుముందెప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తాను. నిజంగా చెప్పాలంటే... టాక్సిక్‌కి ముందు ఒక కియారా, తర్వాత మరో కియారాను ప్రేక్షకులు చూస్తారు. ‘ధోనీ’తో... నా ఆట మొదలైంది! ‘ఫగ్లీ’తో మొదలుపెట్టినా... ‘ఎంఎస్‌ ధోనీ: ది అన్ టోల్డ్‌ స్టోరీ’ నా కెరీర్‌కు మంచి మలుపు. సాక్షి పాత్రను ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారని ఊహించలేదు. ఆ సినిమా తర్వాత ‘కియారా’ అనే పేరు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. బాడీగార్డ్‌లా చూసుకుంది! ‘టాక్సిక్‌’ షూటింగ్‌ సమయంలో నా జీవితంలో చాలా ప్రత్యేకమైన దశ నడుస్తోంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. నేను సేఫ్‌గా ఉండేలా యశ్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ చాలా జాగ్రత్త తీసుకున్నారు. వాళ్లు సెట్‌లో సహనటులు, దర్శకురాలు కంటే... నా బాడీగార్డ్స్‌లా మారిపోయారు! నా బ్యాగ్‌లోని బుక్‌! ఖాళీ సమయం దొరికితే ఇంట్లో కూర్చొని స్కెచ్‌లు వేస్తుంటాను. అందుకే, నా బ్యాగ్‌లో ఎప్పుడూ స్కెచ్‌బుక్‌ ఉంటుంది. కొన్నిసార్లు అమెరికన్ సిరీస్‌లు, సైకలాజికల్‌ థ్రిల్లర్స్‌ చూస్తూ టైమ్‌ పాస్‌ చేస్తాను. షూటింగ్‌ ప్రపంచం నుంచి కాస్త బయటకు రావడానికి ఇవే నా చిన్న చిన్న ఎస్కేప్స్‌. ఫిట్‌నెస్‌ ఫైట్‌! ఫిట్‌నెస్‌ అంటే నాకు బోరింగ్‌ వర్కౌట్స్‌ మాత్రమే కాదు. ఎంఎంఏ, కిక్‌బాక్సింగ్‌ లాంటివి కూడా చేస్తాను. అవి ఫిట్‌గా ఉంచడంతో పాటు చాలా ఎనర్జీ ఇస్తాయి. పైగా యాక్షన్ సినిమాల్లో పనిచేసేటప్పుడు ఆ ట్రైనింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'య

Original source: sakshi.com
Read more on Kaizer News