Kaizer News

మతిస్థిమితం లేని మహిళను బాలుడు గమనించాడు.. ఆతరువాత

మతిస్థిమితం లేని మహిళను బాలుడు గమనించాడు.. ఆతరువాత ఏం చేశాడంటే..!

· State - Telangana · v6velugu.com

మిర్యాలగూడ, వెలుగు: మతిస్థిమితం లేని మహిళపై ఓ బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఆదివారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తల పాలెం గ్రామంలో జరిగింది. రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వృద్ద మహిళ(54)ను అదే గ్రామానికి చెందిన బాలుడు(16) ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బలవంతంగా లాక్కెళ్లి ఓ పాడుబడిన ఇంట్లో కట్టేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి మిర్యాలగూడకు వెళ్లి తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతంలో వెతుకుతుండగా, పాడుబడిన ఇంట్లో నుంచి అరుపులు వినబడ్డాయి. వెంటనే స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News