Kaizer News

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక..

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక..

· State - Telangana · prabhanews.com

పార్టీ కుటుంబాలకు అండగా ఉంటా.. పార్టీని మరింత బలోపేతం చేస్తాం 100 మంది కార్యకర్తలకు సొంత నిధులతో ప్లాటినా బైకులు తిరువూరు, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం.. వెన్నెముక అనే నమ్మకంతో తిరువూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 100 మంది కార్యకర్తలకు కొత్త ప్లాటినా బైకులు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి విడతగా గంపలగూడెం మండలానికి చెందిన ఐదుగురు కార్యకర్తలకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కొత్త ప్లాటినా బైకులను స్వయంగా అందజేశారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు మరింత చురుగ్గా పాల్గొనడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం, గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటంలో కార్యకర్తలకు బైకులు తోడ్పడతాయని పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల సేవలను గుర్తించి వారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News