Kaizer News

శిల్పకళకు కొత్త వెలుగులు.. హైటెక్స్‌లో కార్యక్రమం

శిల్పకళకు కొత్త వెలుగులు.. హైటెక్స్‌లో కార్యక్రమం

· City - Hyderabad · sakshi.com

సాక్షి హైదరాబాద్‌: శిల్పకళకు ప్రాచుర్యం పెంచడంతో పాటు ఇంటీరియర్‌లో దానిని భాగం చేసుకునే అలవాటును పెంపొందించే విధంగా అవగాహాన కల్పించేలా ఢిల్లీకి చెందిన బ్లాక్‌ క్యూబ్‌ గ్యాలరీ డైరెక్టర్‌ సాన్యా మాలిక్‌ ‘స్కల్పె్టడ్‌ ఇండియా’ పేరిట ఒక వేదికను ఏర్పాటు చేశారు. కేవలం గ్యాలరీల్లో కొంత మంది కళాభిమానులకు మాత్రమే కాకుండా శిల్పాలను సాధారణ ప్రజలకు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో డిజైన్‌ డెమోక్రసీ ఇంటీరియర్‌ షోలో.. తోట వైకుంఠం, ఎం.ఎఫ్‌. హుస్సేన్, క్రిషెన్‌ ఖన్నా. హిమ్మత్‌ షా, ధనంజయ్‌ సింగ్‌ తదితరుల కళాకృతులను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. దీనిపై బ్లాక్‌ క్యూబ్‌ గ్యాలరీ డైరెక్టర్‌ సాన్యా మాలిక్‌ మాట్లాడుతూ. మాట్లాడుతూ భారతీయ కళారంగంలో పెయింటింగ్‌కు లభిస్తున్న ప్రాధాన్యంతో పోలిస్తే శిల్పకళ బాగా వెనుకబడింది. అద్భుతమైన శిల్పాలు రూపొందుతున్నప్పటికీ, వాటికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం, గుర్తింపు లభించడం లేదు. శిల్పకళకు విస్త్రుతమైన ఆదరణ లభింపజేయాలనే ఆలోచన నుంచే ‘స్కల్పటడ్‌ ఇండియా’ ఆవిర్భవించింది. ఒక గది, భవనం లేదా పబ్లిక్‌ ప్లేస్‌ను ఆస్వాదించే విధానాన్నే మార్చగల శక్తి శిల్పానికి ఉంది. అందువల్ల శిల్పాలు కేవలం గ్యాలరీల్లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌ ఈవెంట్స్, ఆర్కిటెక్చర్, పబ్లిక్‌ స్పేస్‌లలో భాగం చేస్తున్నామని తెలిపారు. డిజైన్‌ డెమోక్రసీ వంటి డిజైన్ ఆధారిత వేదికలో శిల్పకళను ప్రదర్శించడం వల్ల శిల్పాలను కేవలం ఫైన్‌ ఆర్ట్‌గా కాకుండా ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్, సమకాలీన జీవనశైలిలో అంతర్భాగంగా చూడటానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్త్రుత స్థాయిలో శిల్పకళా ప్రదర్శనలు నిర్వహించడం, కొత్త సందర్శకులను ఆకర్షించడం, కళాకారులు, డిజైనర్లు, సంస్థలు, సాధారణ ప్రజల మధ్య మరింత బలమైన అనుసంధానాన్ని ఏర్పరచడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News