Kaizer News

Chennur: చెన్నూరులో నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్'తో ప

Chennur: చెన్నూరులో నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్'తో పోలీసుల ఆకస్మిక సోదాలు!

· State - Telangana · hmtvlive.com

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో డ్రగ్స్, గంజాయి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా చెన్నూరు పోలీసులు ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో మమ్మరంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. చెన్నూరు పట్టణ సీఐ బన్సిలాల్ నేతృత్వంలో జిల్లా డాగ్ స్క్వాడ్ పోలీస్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్' సహాయంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని గాంధీచౌక్ ప్రాంతంలో గల హోటళ్లు, కిరాణా షాపులు, మెడికల్ షాపులతో పాటు పలు పాఠశాలల ప్రాంగణాలను డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నాయా అనే కోణంలో నిశితంగా నార్కోటిక్ డాగ్స్ స్క్వాడ్ టీం తో ప్రత్యేకంగా పరిశీలించారు. చెన్నూరు పట్టణంలో ముఖ్యంగా యువత, విద్యార్థుల భవిష్యత్తును పాడుచేస్తున్న గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది, చెన్నూరు పోలీస్ సిబ్బంది పా ల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News