Kaizer News

బడ్జెట్‌ పద్మనాభం.. ధరాఘాతం

బడ్జెట్‌ పద్మనాభం.. ధరాఘాతం

· State - Telangana · sakshi.com

బియ్యం, పప్పు మొదలు ఉల్లి వరకు భారీగా పెరిగిన ధరలు బెంబేలెత్తిస్తున్న కూర‘గాయాలు’.. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు కుటుంబ బడ్జెట్‌కు రూ.8వేల నుంచి రూ.10 వేల అదనపు భారం ధరల దెబ్బకు కుటుంబ బడ్జెట్లు తారుమారు.. అప్పులే దిక్కు ఆదాయం పెరగక, ఖర్చులు తగ్గక దిగువ మధ్యతరగతి కుటుంబాలు విలవిల ధరలు భారీగా పెరిగినా ఏమాత్రం పట్టించుకోక మొద్దు నిద్రలో సర్కారు ధరల పెరుగుదల తీరును సీఎం డ్యాష్‌ బోర్డే వెల్లడిస్తున్నా చర్యలు నిల్‌ చంద్రబాబు సర్కారు ఉపశమన చర్యలు చేపట్టక పోవడంపై ప్రజలు ఆగ్రహం రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడంతో సామాన్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. ఒకప్పుడు రూ.40 వేలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు.. ఇప్పుడు అదే అవసరాలకు మరో రూ.8ృ10 వేల వరకు అదనంగా వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యం, పంచదార, నూనె, పప్పులు, ఉల్లిపాయలు, కూరగాయలు.. ఇలా వంటింట్లో అడుగుపెట్టిన ప్రతి సరుకూ ధరల షాక్‌ ఇస్తోంది. సామాన్యుల ఆదాయం పెరగక.. ఖర్చులు తగ్గించుకోలేక.. చివరకు ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: విశాఖలోని ఎండాడలో ఉంటున్న సత్యకృష్ణది నలుగురు సభ్యుల సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈమెతో పాటు భర్త నగేష్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిరుద్యోగి. ఇద్దరు స్కూల్‌కు వెళ్లే పిల్లలతో సంసారం నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా జీతం చేతికందే రోజు లెక్కలు వేసుకొని ఖర్చు చేస్తున్నారు. అయితే ఆరు నెలలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు వీరికి శరాఘాతంగా మారాయి. నెలకు రూ.40 వేల ఖర్చుతో కూడిన వీరి బడ్జెట్‌ తల్లకిందులైంది. గత ఆరు నెలలతో పోలిస్తే ఇప్పుడు అధికంగా మరో ఎనిమిది వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెరగక పోవడంతో ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం అప్పు చేయక తప్పని పరిస్థితి. ఇవన్నీ తప్పనిసరిగా ఖర్చు చేయాల్సినవి కావడంతో ప్రతి నెలా అప్పు కోసం చేయి చాచాల్సి వస్తోంది. ఇలా కేవలం ఒక్క సత్యకృష్ణే కాదు.. రాష్ట్రంలో ఏ దిగువ మధ్య తరగతి వారిని కదిపినా ఇదే ఆవేదన వ్యక్తమవుతోంది. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలు ఇంతగా విలవిల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. బియ్యం, పంచదార, ఎండుమిర్చి, నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు, కూరగాయలు, పెట్రోల్‌.. ఇలా ఏ వస్తువు ముట్టుకున్నా షాక్‌ కొట్టే పరిస్థితి నెలకొంది. చౌక ధరలు, రైతు బజార్ల ద్వారా సరుకులు సరఫరా చేసి ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం అలాంటి ఆలోచనే చేయడం లేదు. గత ఆరు నెలలుగా ధరలు విపరీతంగా పెరిగిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్యాష్‌ బోర్డే గణాంకాలతో సహా వివరిస్తున్నా, ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించక పోవడం దారుణం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులపాలవుతున్న పేదలు ప్రభుత్వ డ్యాష్‌ బోర్డులో హోల్‌సేల్‌ ధరల కంటే రిటైల్‌ మార్కెట్లో ధరలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కేజీ బియ

Original source: sakshi.com
Read more on Kaizer News