Kaizer News

బ్లాకేజీ శాతమే కాదు.. ప్రభావం కూడా కీలకం!

బ్లాకేజీ శాతమే కాదు.. ప్రభావం కూడా కీలకం!

· State - Telangana · prabhanews.com

కార్డియాక్‌ సీటీతో గుండె జబ్బులపై మరింత కచ్చితమైన అంచనా సీటీ-ఎఫ్‌ఎఫ్‌ఆర్‌, ప్లాక్‌ విశ్లేషణతో ముందస్తు ముప్పు గుర్తింపు చికిత్సకు ముందే ధమనుల పరిస్థితిపై సమగ్ర అవగాహన ప్రతిస్పందనాత్మక వైద్యం నుంచి ముందస్తు, వ్యక్తిగతీకరించిన చికిత్స వైపు అడుగులు ఏఐ, ఆధునిక ఇమేజింగ్‌పై వైద్య నిపుణుల సదస్సులో విస్తృత చర్చ విజయవాడ, ఆంధ్రప్రభ : గుండె ధమనుల్లో బ్లాకేజీ ఎంత ఉందన్నదే కాకుండా.. దాని వల్ల రక్తప్రవాహంపై ఎంత ప్రభావం పడుతోంది? ప్లాక్‌ స్వభావం ఎలా ఉంది? భవిష్యత్‌లో గుండెపోటు ముప్పు ఎంత? వంటి అంశాలను మరింత కచ్చితంగా అంచనా వేసే దిశగా ఆధునిక కార్డియాక్‌ సీటీ సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్‌, ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు తెలిపారు. ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో, ఐఎంఏ విశాఖపట్నం శాఖ సహకారంతో ‘ఏఐ ఇన్‌ కార్డియాలజీ–ట్రాన్స్‌ఫార్మింగ్‌ రియాక్టివ్‌ టు ప్రివెంటివ్‌ థెరపీ’ అంశంపై నిర్వహించిన నిరంతర వైద్య విద్యా కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ శతజయంతి కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సుమారు 300 మంది వైద్యులు, కార్డియాలజిస్టులు, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, పీజీ విద్యార్థులు హాజరయ్యారు. గతంలో కార్డియాక్‌ సీటీని ప్రధానంగా గుండె ధమనుల్లోని బ్లాకేజీలను గుర్తించేందుకు వినియోగించేవారు. ఆధునిక సాంకేతికతలతో ఇప్పుడు ధమనుల పరిస్థితిని మరింత లోతుగా విశ్లేషించే అవకాశం ఏర్పడిందని డాక్టర్‌ రమేష్‌బాబు వివరించారు. సీటీలో కనిపించే ధమని సంకుచితం ప్రతిసారీ గుండెకు రక్తప్రవాహాన్ని ఒకే స్థాయిలో ప్రభావితం చేయదని తెలిపారు. సీటీ-ఎఫ్‌ఎఫ్‌ఆర్‌ ద్వారా బ్లాకేజీ రక్తప్రవాహంపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడానికి వీలవుతుందని చెప్పారు. ప్లాక్‌ స్వభావంపైనా దృష్టి కేవలం బ్లాకేజీ శాతాన్ని తెలుసుకోవడం సరిపోదని.. ధమనుల్లో ఏర్పడిన ప్లాక్‌ నిర్మాణం, కాల్షియం తదితర లక్షణాలను పరిశీలించడం ద్వారా వ్యాధిపై మరింత సమగ్ర అవగాహన పొందవచ్చని తెలిపారు. బయటకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లోనూ గుండె ధమనుల వ్యాధి ప్రారంభ దశలో ఉండే అవకాశం ఉన్నందున ఆధునిక ఇమేజింగ్‌, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు ముందస్తు ప్రమాద అంచనాలో కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. కార్డియాక్‌ సీటీ భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణకే పరిమితం కాకుండా చికిత్స ప్రణాళికలోనూ కీలక పాత్ర పోషించనుందని డాక్టర్‌ రమేష్‌బాబు తెలిపారు. ధమనుల నిర్మాణంపై సీటీ సమాచారం, రక్తప్రవాహంపై సీటీ-ఎఫ్‌ఎఫ్‌ఆర్‌ అంచనా, ప్లాక్‌ విశ్లేషణను సమన్వయం చేయడం ద్వారా రోగి పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్సా వ్యూహాన్ని రూపొందించవచ్చన్నారు. ప్రతిస్పందనాత్మకత నుంచి ముందస్తు వైద్యం కృత్రిమ మేధ, ఆధునిక ఇమేజింగ్‌ సాంకేతికతలు కలిసి పనిచేయడంతో సమస్య వచ్చిన తర్వాత చికిత్స అందించే విధానం నుంచి వ్యాధిని ముందుగానే గుర్తించి ప్రమాదాన్ని అంచనా వేసే ముందస్తు, కచ్చితమైన వైద్యం వైపు గుండె వైద్యరంగం పయనిస్తోందని తెలిపారు సదస్సులో హార్ట్‌ ఫెయిల్య

Original source: prabhanews.com
Read more on Kaizer News