Kaizer News

ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా బోట్ల రమేష్

ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా బోట్ల రమేష్

· State - Telangana · prabhanews.com

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జూబ్లీ నగర్‌కు చెందిన బోట్ల రమేష్‌ ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా, రేపాక గ్రామానికి చెందిన చావటి సంతోష్‌ మండల అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులను బీజేపీ రేగొండ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎమ్మార్పీఎస్‌ నాయకులు దళితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. మండలంలో సామాజిక సమస్యలపై ప్రజలకు అండగా నిలిచి, వారి హక్కుల కోసం పనిచేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా బోట్ల రమేష్‌, అధికార ప్రతినిధిగా చావటి సంతోష్‌ ఎన్నిక కావడం పట్ల వారి అనుచరులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్‌ గాలిఫ్‌, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు కురాకుల మల్లయ్య, మాట్ల రవీందర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News