ఉరవకొండ, సెప్టెంబర్ 19 (ఆంధ్రప్రభ ): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని ఉరవకొండ తహసీల్దార్ పి.జి అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) ఆన్ లైన్ ద్వారా వచ్చిన 10అర్జీలలో సివిల్ సప్లయిస్ కు సంబంధించిన 1, డెత్ అండ్ బర్త్ కు సంబంధించిన 2, ఆర్ వో ఆర్ 5, ఇంటి స్థలాలకు సంబంధించిన 2 అర్జీలు వచ్చాయని, 4 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. 6 భూమికి సంబంధించిన అర్జీలు రావడంతో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆన్ లైన్ లో ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం 49 అర్జీలు వచ్చా యని, అందులో 11అర్జీలను తిరస్కరించామని, 35 పరిష్కరించి పరిష్కరించడం జరిగిందన్నారు. కేవలం 3 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇన్ కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు కోసం 6 అర్జీలు రాగా 4 పరిష్కరించామని, అందులో 1 తిరస్కరించి, కేవలం ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉందన్నారు. చిన్న, సన్న కారు రైతుల సర్టిఫికెట్లను సంబంధించి 9 అర్జీలు వచ్చాయని, అందులో 5 పరిష్కరించగా 4 మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. ఎల్ ఆర్ బీడీ కు సంబంధించిన 45 అర్జీలు రాగా అందులో 11 అర్జీలను పరిష్కరించగా, 34 పెండింగ్ లో ఉన్నాయని, ఆధార్ సీడింగ్ కై 4 అర్జీలు రాగా పూర్తి స్థాయిలో పరిష్కరించామన్నారు. ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం 168 అర్జీలు రాగా, పూర్తిస్థాయిలో పరిష్కరించామన్నారు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు 49అర్జీలు రాగా, పూర్తిస్థాయిలో పరిష్కరిం చామన్నారు