Kaizer News

ట్రెండింగ్‌లో 'ఏష నాగుల'... టాలీవుడ్‌ను ఏలుతున్న త

ట్రెండింగ్‌లో 'ఏష నాగుల'... టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!

· State - Telangana · sakshi.com

‘ఏష నాగుల కట్టమీద యేసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల..’ ఇప్పుడు సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఇదే పాట. ఇన్‌స్టాలో లక్షల్లో రీల్స్‌.. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన క్లిప్పులే కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు తెలంగాణ పల్లెల్లో, దావత్‌ల్లో, పండుగల్లో, పెళ్లిళ్లలో వినిపించిన పాట ఇప్పుడు సినిమా ప్రమోషన్‌లో భాగమై.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ‘ది ప్యారడైజ్‌’ నుంచి విడుదలైన ‘ఏష నాగుల’ పాటకు వస్తున్న రెస్పాన్స్‌ దీనికి తాజా ఉదాహరణ. అయితే ఇది ఒక్క పాటతో మొదలైన ట్రెండ్‌ కాదు. కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ క్రమంగా తమ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు జానపద గీతం అంటే పల్లె వాతావరణానికే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు అదే పాట థియేటర్‌లో మాస్‌ సెలబ్రేషన్‌కు, సోషల్‌ మీడియాలో రీల్స్‌కు, ఫంక్షన్లలో డ్యాన్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పల్లె నుంచి పట్టణానికి.. అక్కడి నుంచి పాన్‌ ఇండియా ప్రేక్షకుల వరకు తెలంగాణ జానపదం తన జోరు చూపిస్తోంది. ‘సారంగ దరియా’తో మొదలైన కొత్త ఊపు తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌కు ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద మలుపుల్లో ‘సారంగ దరియా’ ఒకటి. లవ్‌స్టోరీ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్‌తో ఈ పాటకు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణ జానపద సంప్రదాయంలో ఉన్న పాటను సినిమాకు తగ్గట్టుగా కొత్త రూపంలో తీసుకొచ్చారు. 2021లో విడుదలైన ఈ పాట సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయింది. ఫోక్‌ ట్యూన్‌కు సినిమా విజువల్స్‌, మాస్‌ బీట్‌ తోడైతే ఏ రేంజ్‌లో రీచ్‌ వస్తుందో ‘సారంగ దరియా’ చూపించింది. ‘రాములో రాములా’.. ఫోక్‌ బీట్‌కు కమర్షియల్‌ టచ్‌ ఆ తర్వాత ‘అల..వైకుంఠపురములో’మూవీలోని ‘రాములో రాములా’ కూడా తెలంగాణ యాస, జానపద పదజాలం, మాస్‌ బీట్‌ను కమర్షియల్‌ సినిమా సౌండ్‌తో కలిపిన పాటగా నిలిచింది. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ గాత్రం.. తమన్‌ సంగీతం.. కాసర్ల శ్యామ్‌ తెలంగాణ నేటివిటీతో కూడిన పదాలు.. ఈ కాంబినేషన్‌ పాటను జనాల్లోకి తీసుకెళ్లింది.ఇక్కడే టాలీవుడ్‌ మ్యూజిక్‌లో ఒక మార్పు మొదలైంది. ఫోక్‌ అంటే కేవలం పల్లె పాట కాదు.. ఫోక్‌ను కమర్షియల్‌గా ప్యాకేజ్‌ చేస్తే అదే మాస్‌ ఆంథమ్‌ అనే ఫార్ములా వర్కవుట్‌ అయింది. ‘దసరా’లో పల్లె మట్టి వాసన ఆ తర్వాత ‘దసరా’లోని ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ తెలంగాణ జానపదానికి మరింత మాస్‌ రూపాన్ని ఇచ్చింది. ఈ పాటలో కేవలం ఫోక్‌ ట్యూన్‌ను ఉపయోగించడం కాకుండా నిజమైన జానపద కళాకారుల గాత్రాలను కూడా వినిపించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌తో పాటు గన్నోర దాస లక్ష్మి, గొట్టె కనకవ్వ, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న వంటి జానపద కళాకారులు పాటలో భాగమయ్యారు. అంటే.. సినిమా పాటలో ఫోక్‌ కలపడం నుంచి ఫోక్‌నే సినిమా పాటగా మార్చే స్థాయికి టాలీవుడ్‌ వచ్చేసింది. అలాగే ఇదే సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’పాట కూడా తెలంగాణ పదాలతో సాగుతుంది. ‘ఊరు పల్లెటూరు’.. జానపదానికి అసలైన నేటివిటీ ‘బలగం’సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటలో తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన, వ్యవసాయం, కుటుంబ బంధాలు, ఊరి అనుబంధం అన్నీ కనిపిస్తాయి. మంగ్లీ, రామ్‌ మిరియాల, భీమ్స్

Original source: sakshi.com
Read more on Kaizer News