ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేయనున్నట్లు గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ 29 గుంటల స్థలంలో రూ.5 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణానికి నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తామని తెలిపారు