Kaizer News

సైనికుల మరణాలను దాస్తున్న అమెరికా?

సైనికుల మరణాలను దాస్తున్న అమెరికా?

· National - India · ntnews.com

వాషింగ్టన్‌ పోస్టుసంచలన కథనం న్యూయార్క్‌ : ఇరాన్‌ యుద్ధంలో చనిపోయిన అమెరికా సైనికుల సంఖ్యను ఆ దేశం దాచిపెడుతున్నదనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. సైనికుల మరణాలపై వాషింగ్టన్‌ పోస్టు సంచలన కథనం ప్రచురించింది. ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 22 మంది అమెరికా సైనికులు చనిపోయినట్టు ఆ కథనం పేర్కొన్నది. పెంటగాన్‌ పబ్లిక డాటాబేస్‌లో ఉన్న సంఖ్యకంటే నలుగురు ఎక్కువ ఉన్నారనేది ఈ కథనం సారాంశం. ఈ కథనంపై యూఎస్‌ రక్షణశాఖ మంత్రి పీట హెగ్సెత్‌ మండిపడ్డారు. వారు అమెరికా సైనిక మోహరింపుతో సంబంధం ఉన్న ఘటనల్లో కొందరు చనిపోయినట్టు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. వాషింగ్టన్‌ పోస్టు అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు

Original source: ntnews.com
Read more on Kaizer News