Kaizer News

ఇంట్లోనే కుట్టు పని.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాల

ఇంట్లోనే కుట్టు పని.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాలు!

· Technology · sakshi.com

చి న్న కుట్టు ఊడినా.. బటన్‌ ఊడిపోయినా.. టైలర్‌ షాప్‌ వరకు పరుగెత్తాల్సిందేనా? ఇక ఆ అవసరం లేదు. దుస్తులకు ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే చిటికెలో చక్కబెట్టుకునే చిట్టి గాడ్జెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చేతిలో పట్టుకునేంత చిన్నగా ఉండే వీటితో కుట్టు వేయడం నుంచి బటన్‌ సెట్‌ చేయడం వరకు పనులు ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ గాడ్జెట్లు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటి ధర ఎంత? తెలుసుకుందాం.. కుట్టు పనికి.. షార్ట్‌కట్‌! పెద్ద పెద్ద వీఐపీల రికమెండేషన్స్‌ కూడా పనిచేయని ప్లేసుల్లో టైలర్‌ షాప్‌ ఒకటి. చిరుగు చిన్నదే అయినా, దాన్ని సరిచేయడానికి ఏడాదైనా సరిపోదు. అందుకే, దుస్తులకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చిటికెలో చక్కబెట్టే ఈ చిట్టి గాడ్జెట్లు ఇప్పుడు మీకోసం! చేతిలో చిట్టి టైలర్‌! బట్ట చిరిగితే టైలర్‌ షాపుకి పరుగెత్తడం, చిన్న కుట్టు ఊడితే సూది దారం కోసం ఇల్లంతా వెతకడం వంటి కష్టాలకు కాస్త సెలవివ్వండి. చూడటానికి అచ్చం స్టేప్లర్‌లా ఉండే ఈ మినీ హ్యాండ్‌ కుట్టు మిషన్, ఇప్పుడు చిన్నపాటి కుట్టుపనులను చకచకా చక్కబెట్టేస్తుంది. పైగా ఇందుకోసం కరెంట్‌ అవసరం లేదు. బ్యాటరీలు మార్చే టెన్షన్‌ లేదు... చేతితోనే నడిపించేయొచ్చు. షర్టులు, ప్యాంట్లు, కర్టెన్లు వంటి దుస్తుల్లో చిన్న చిరుగులు, ఊడిన కుట్లు వంటివాటిని సరిదిద్దుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాటన్‌ , లినెన్‌ వంటి పలచని వస్త్రాలకు కూడా అనువుగా ఉంటుంది. సైజులో చిన్నదే కాబట్టి బ్యాగులో వేసుకుని బయటకూ తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ.300 మాత్రమే! బలన్‌ సెటిల్‌మెంట్‌! దుస్తుల బటన్‌ ఊడిందంటే చాలు. ఇక ఆ దుస్తులతో విడాకులు తీసుకుంటా అంటూ మొండిగా మారకండి! కాస్త దానికొక అవకాశం ఇవ్వండి. ఇందుకోసం పెద్దగా కష్టపడకుండా, ఒక్క క్లిక్‌ చేస్తే బటన్‌ సెట్‌ అయిపోతుంది. ఎందుకంటే, ఇప్పుడు ఈ మెటల్‌ స్నాప్‌ బటన్‌ కిట్‌తో కేవలం ఒక్క క్లిక్‌ చేస్తే చాలు. వెంటనే, బటన్‌ సెట్‌ చేసుకోవచ్చు. స్నాప్‌ బటన్లను బిగించేందుకు ప్రత్యేక ప్లయర్‌తో వచ్చే ఈ కిట్‌లో వంద సెట్ల బటన్లు ఉన్నాయి. షర్ట్స్, బేబీ డ్రెస్‌లులు, బట్ట సంచులు, బొమ్మల దుస్తులు, చేతిపనుల అలంకరణలు– ఇలా వస్త్రాలతో చేసే ఎన్నో పనుల్లో ఉపయోగించుకోవచ్చు. రాగితో తయారైన బటన్లు మన్నికగా ఉండేలా రూపొందించారు. చేతిలో పట్టుకునే ప్లయర్‌కు జారిపోకుండా పట్టుకునే పట్టు ఉండటంతో బటన్‌ ను సరిగ్గా అమర్చుకోవచ్చు. అయితే మొదటిసారి ఉపయోగించే ముందు పాత బట్ట ముక్కపై ఒకసారి ప్రయత్నిస్తే మంచిది. ధర రూ. 300 మాత్రమే. చిన్నబోతే... బుజ్జగిస్తుంది! జీన్స్‌ కొనేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది... రెండు నెలలు గడిచేసరికి మీ జీన్స్, ‘నడుము సైజ్‌కు నాకు ఏ మాత్రం ఇక కుదరదు!’ అన్నట్టు దూరంగా పోతుందా? ఈ సమస్యకు పరిష్కారమే ఈ డెనిమ్‌ బటన్‌ క్లిప్‌ కిట్‌. కుట్టు అవసరం లేకుండానే బటన్‌ ను సులభంగా అమర్చుకుని జీన్స్, ప్యాంట్లు, స్కర్ట్స్, షార్ట్స్, జాకెట్లు వంటి వాటి నడుము పరిమాణాన్ని అవసరానికి తగ్గట్టు సర్దుకోవచ్చు. ప్రత్యేకమైన పట్టుకునే విధానంతో బటన్‌ బిగుతుగా ఉండేలా రూపొందించారు. పైగా ఎనిమిది బటన్‌ ప్యాకేజ్‌ కావడంతో ఒకటి పోయినా, ఇంకొకటి ఊడిపోయ

Original source: sakshi.com
Read more on Kaizer News