Kaizer News

Jagadishwar Reddy | ఎల్ నినో ఎంత అబద్ధమో, బొగ్గు క

Jagadishwar Reddy | ఎల్ నినో ఎంత అబద్ధమో, బొగ్గు కొరత కూడా అంతే అబద్ధం : మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

· State - Telangana · ntnews.com

నల్లగొండ : ఎల్ నినో ( El Nino) పేరు చెప్పి కాంగ్రెస్‌ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్‌ రెడ్డి ( Jagadishwar Reddy ) ఆరోపించారు. ఎల్ నినో ఎంత అబద్ధమో, బొగ్గు కొరత కూడా అంతే అబద్ధమని వెల్లడించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెం గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ​రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది ( Congress Government ) నేరపూరిత చర్య అని ఆరో పించారు. నీళ్లొచ్చినా కృష్ణా కింద పంటలు ఎందుకు ఎండబెడుతున్నారో సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు కృష్ణా​నీళ్లు వాడుకున్నామని అబద్ధం చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్‌ రైతులకు ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. ​గతంలోనూ కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంటలు సాగుచేసుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ​కేసీఆర్ వచ్చినంకనే పంటలు సాగుచేసుకుని, బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారని, గడిచిన మూడేండ్లుగా పంటలు ఎండబెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​కేసీఆర్ హయాంలో వరుసగా నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు అందించామని గుర్తు చేశారు. యాదాద్రి, భద్రాద్రిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్లు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ​నీళ్లు లేవని ఒకరు, బొగ్గు లేదని మరొకరు బంద్ పెడుతున్నారని విమర్శించారు. ​ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను ఇబ్బందులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. ​ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News