Kaizer News

Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX

Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు

· State - Telangana · ntvtelugu.com

మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు 3XO REVX Edge కొత్త వేరియంట్లు వచ్చేశాయి ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు Follow Us : --> Add as a preferred source on google Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా ప్రముఖ కాంపాక్ట్ SUV XUV 3XO లైనప్‌ను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్త REVX Edge, REVX Edge (O) వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త REVX Edge ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.39 లక్షలు కాగా, REVX Edge (O) ధర రూ.9.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కంపెనీ REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో పరిచయం చేసింది. REVX Edge పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.9.39 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.10.59 లక్షలు కాగా, డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.59 లక్షలుగా ఉంది. REVX Edge (O) పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.89 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్, డీజిల్ మాన్యువల్ వేరియంట్ల ధర రూ.11.09 లక్షలు. డీజిల్ AMT వేరియంట్ ధర రూ.11.91 లక్షలు. కొత్త REVX Edge (O) వేరియంట్ ప్రధాన ఆకర్షణల్లో పనోరమిక్ సన్‌రూఫ్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.9.89 లక్షలు కావడంతో రూ.10 లక్షల్లోపే పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న SUVగా ఇది నిలుస్తుంది. ఈ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు రూఫ్ రైల్స్, ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ అయ్యే ORVMలు, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. XUV 3XO REVX Edgeలో డ్యూయల్-టోన్ రూఫ్, బాడీ-కలర్/గన్‌మెటల్ గ్రిల్, బ్లాక్ వీల్ కవర్లతో కూడిన 16-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి. అలాగే బై-హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED సిగ్నేచర్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, ORVMలపై LED టర్న్ ఇండికేటర్లు, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు అందించారు. క్యాబిన్‌లో బ్లాక్ లెదరెట్ సీట్లు ఉంటాయి. ఇందులో 26.03 సెం.మీ. HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఇది నాలుగు స్పీకర్లతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌తో వస్తుంది. ఇతర ఫీచర్లలో వైర్‌లెస్ Android Auto, వైర్డ్ Apple CarPlay, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, స్టోరేజ్, రియర్ ఆర్మ్‌రెస్ట్, కప్ హోల్డర్, రియర్ AC వెంట్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ఫ్రంట్, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ అయ్యే ORVMలు, స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్, Econ Mode, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి. REVX Edge (O) వేరియంట్‌లో సాధారణ REVX Edgeలో ఉన్న ఫీచర్లతో పాటు మరికొన్ని అదనపు సదుపాయాలు లభిస్తాయి. వాటిలో పనోరమిక్ సన్‌రూఫ్, రూఫ్ రైల్స్, ఎలక్ట్రికల్‌గా ఫోల్డింగ్ ORVMలు, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఆటో వైపర్స్ ప్రధానమైనవి. మహీంద్రా ప్రకారం, రెండు REVX Edge ట్రిమ్‌లలో కలిపి 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 ఎయిర్‌బ్యాగ్స్, Electronic Stability Control (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కిం

Original source: ntvtelugu.com
Read more on Kaizer News